అయోధ్యలో కనీవినీ ఎరుగనిరీతిలో రామాలయం, దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు: రాజ్‌నాథ్ సింగ్
జాతీయ పౌరసత్వ రిజిష్టర్ (ఎన్ఆర్సీ) దేశవ్యాప్తంగా అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది. ఇటీవల బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయినా.. ప్రభుత్వ విధానమేమి మారలేదు. జార్ఖండ్‌లో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఎన్ఆర్సీపై మోడీ సర్కార్ వైఖరిని మరోసారి తెలియజేశారు.

ఎన్ఆర్సీ అమలు..
అసోంలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్ఆర్సీ అమలు చేస్తామని తెలిపారు. ఆదివారం జార్ఖండ్‌లో రాజ్‌నాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాతీయ పౌరసత్వ రిజిష్టర్ దేశవ్యాప్తంగా అమలు చేస్తామని ఉద్గాటించారు. అంతేకాదు తమ దేశంలో వలసదారులు ఉండాలని కోరుకోరని స్పష్టంచేశారు. కానీ కొన్ని పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం దీనిపై రచ్చ చేస్తున్నాయని విమర్శించారు.

ఎందుకిలా..?
జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజ్‌నాథ్ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు పెరుగుతుందా అనే వాదన కూడా ప్రారంభమైంది. కానీ మెజార్టీ వర్గం మాత్రం వ్యతిరేకంగా ఉంటుందనే చర్చ కూడా జరుగుతుంది. జార్ఖండ్‌లో తిరిగి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని రాజ్‌నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

ఫుల్ మెజార్టీ
బొటా బోటి కాకుండా.. పూర్తి మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరుతుందని చెప్పారు. బీజేపీ ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులను విమర్శించే స్థాయి ఏ నేతకు లేదని గుర్తుచేశారు. వారే అవినీతిపరులని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

కనీవినీ ఎరుగనిరీతిలో
అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తామని రాజ్‌నాథ్ స్పష్టంచేశారు. రాముడి జన్మస్థానంలో ఆలయం నిర్మిస్తామని పేర్కొన్నారు. తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హమీ మేరకు ఆలయ నిర్మాణం ఉంటుందని తెలిపారు. కానీ కొన్ని పార్టీలు కూడా తమ మేనిఫెస్టోను విమర్శించాయని గుర్తుచేశారు. ఇప్పుడు చూడండి ఆ హామీ నెరవెరబోతుందని చెప్పారు.ప్రపంచంలోనే ప్రఖ్యాత ఆలయంగా రూపుదిద్దుకోబోతుందని చెప్పారు. నాలుగేళ్లలో ఆలయ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై












Click it and Unblock the Notifications