వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపికి ‘హోదా’కంటే ఎక్కువ నిధులిస్తాం: అరుణ్ జైట్లీ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ హామీ ఇచ్చారు. శనివారం నరేంద్ర మోడీ ఏడాది పాలనపై ఏర్పాటు చేసిన రెండో మీడియా సమవేశంలో ఆయన మాట్లాడుతూ.. సాంకేతిక కారణాల వల్లే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం ప్రత్యేక హోదా హామీ ఇచ్చి ఉందని ఈ విషయంలో ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తామని అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఒక్కరూపాయి కూడా తక్కువ కాకుండా నిధులిస్తామని ఆయన అన్నారు.

Arun Jaitley

హైదరాబాద్‌ వదులుకోవడం వల్ల ఏపీ కోల్పోయిన నిధులను సమకూరుస్తామని జైట్లీ చెప్పారు.
ఏపిని అన్ని విధాలా ఆదుకుంటామని పునరుద్ఘాటించారు. ఏపిలోని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

అవినీతి పాలన స్థానంలో పారదర్శక పాలన వచ్చిందని మోడీ పాలనపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్‌ స్థాయి పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది చివర్లో జరుగనున్న బీహార్‌ ఎన్నికల్లో తాము విజయం సాధించి తీరుతామని జైట్లీ స్పష్టం చేశారు.

బీహార్ సిఎం నితీష్‌, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ల పొత్తు అనైతికమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోందన్నారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉందని అరుణ్ జైట్లీ తెలిపా
రు.

English summary
Union Minister Arun Jaitley on Saturday said that they will release more funds to Andhra Pradesh development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X