ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు: వివరణ ఇవ్వం, ఏం చేస్తారు, టీటీవీ దినకరన్ గ్రూప్ !
తమిళనాడు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు మేము ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఇక ముందు ఇవ్వమని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యే వెట్రివేల్ తదితరులు చెప్పారు.
చెన్నై: తమిళనాడు స్పీకర్ ధనపాల్ ఇచ్చిన నోటీసులకు మేము ఎలాంటి సమాధానం ఇవ్వలేదని, ఇక ముందు ఇవ్వమని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యే వెట్రివేల్ తదితరులు చెప్పారు. ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి పనితీరు నచ్చకనే మేము ఆయనకు మద్దతు ఉపసంహరించుకున్నామని అన్నారు.
ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారని, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే వెట్రివేల్ ఆరోపించారు. ధర్మయుద్దం అంటూ ఇన్ని రోజులు మాయమాటలు చెప్పిన పన్నీర్ సెల్వం పదవులు ఇచ్చేసరికి ధర్మయుద్ధం పక్కనపెట్టారని ఎద్దేవ చేశారు.

ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి శాసన సభలో బలపరీక్ష నిరూపించుకోవడానికి సిద్దం కావాలని, అప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేసి కొత్త సీఎంను ఎన్నుకుంటామని వెట్రివేల్ అన్నారు. పళనిసామి, పన్నీర్ సెల్వంకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని ఎమ్మెల్యే వెట్రివేల్ జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ కొనసాగుతారని వెట్రివేల్ తో సహ ఆయన వర్గంలోని ఎమ్మెల్యేలు అంటున్నారు.












Click it and Unblock the Notifications