ఏపీ, తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది.
చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సంచాలకులు వెల్లడించారు. ఆదివారం ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి కొమోరిన్ ప్రాంతం మరఠ్వాడ, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక అంతటా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతుందన్నారు.

ఇది ఇలావుండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ మూడు రోజులపాటు తేలికాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవవచ్చని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ లేదా నైరుతి గాలులు వీస్తున్నాయని వెల్లడించింది . ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు.












Click it and Unblock the Notifications