వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ క్యాబ్ రేప్: శివకుమార్ యాదవ్‌పై మరో మహిళ ఫిర్యాదు

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉబేర్ క్యాబ్ డ్రైవర్ శివ కుమార్ యాదవ్ గురించిన విషయాలు ఒక్కటొక్కటే వెలుగులోకి వస్తున్నాయి. మహిళా ఎగ్జిక్యూటివ్‌పై అత్యాచారం చేసిన ఘటన నేపథ్యంలో శివకుమార్ యాదవ్ తీరుపై అంతకు ముదే ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డ్రైవర్ నడిపిన కారులో ప్రయాణించడం ఎంత దుర్భరంగా గడిచిందో చెబుతూ ఓ మహిళ ట్వీట్ చేశారు.

టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు శివ కుమార్ యాదవ్ తనను తీక్షణంగా చూసిన తీరుపై నిధి షా అనే మహిళ నవంబర్ 26వ తేదీన ఉబేర్ క్యాబ్ సంస్థకు ఫిర్యాదు చేశారు. మిర్రర్‌లో తనను అతను తీక్షణంగా చూడడం గమనించినట్లు, దాంతో తనకు చిరాకు వేసినట్లు, ఆ సమయంలో తన భాగస్వామి తాను కారులో కూర్చున్నట్లు ఆమె చెప్పింది. ఈ విషయంపై తాను ఉబేర్‌కు తెలిపినట్లు కూడా ఆమె చెప్పారు. ఈ విషయంపై ఆమె న్యూస్ చానెల్‌తో కూడా మాట్లాడారు.

 A week before Uber rape case, another woman reported driver Shiv Kumar Yadav for 'staring'

ఉబేర్‌కు పంపిన ఈమెయల్ ప్రతిని ఆమె ట్విట్టర్‌లో పోస్టు చేశారు. జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నట్లు, ఆమె ప్రతిని డ్రైవర్ ఆపరేషన్ టీమ్‌కు పంపినట్లు, శివ కుమార్ యాదవ్‌ను హెచ్చరించినట్లు ఉబేర్ ఎగ్జిక్యూటివ్ హన్నా ఆ సమయంలో ఆ మహిళకు తెలిపారు.

శుక్రవారం రాత్రి ఢిల్లీలో 27ఏళ్ల మహిళ క్యాబ్‌లో ఇంటికి వెళ్తుండగా డ్రైవర్ మార్గమధ్యంలో అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దక్షిణ ఢిల్లీలోని వసంత్ విహార్‌ నుంచి ఉత్తర ఢిల్లీలోని ఇందర్‌లోక్‌లో గల తన ఇంటికి తిరిగి వెళ్తుండగా రాత్రి జరిగింది. గుర్గావ్‌కు చెందిన గ్లోబల్ టాక్స్ అండ్ అడ్వయిజరీ సర్వీస్ కన్సల్టెంట్స్‌లో పనిచేస్తోంది.

మొబైల్ ఆప్ ద్వారా ఆమె ఇంటికి తిరిగి వెళ్లడానికి స్విఫ్ట్ డిజైర్‌ను బుక్ చేసుకుంది. ఆ స్విఫ్ట్ కారులోనే దారుణం చోటు చేసుకుంది. తనపై ఎక్కడ అత్యాచారం జరిగిందీ ఆమె గుర్తించే స్థితిలో లేదు. మిత్రులతో డ్రింక్స్ తాగడం వల్ల, తనపై దాడి జరిగిన దిగ్భ్రమ నుంచి తేరుకోనందు వల్ల ఆమె స్థలాన్ని గుర్తించలేకపోతున్నట్లు చెబుతున్నారు.

కారులో కూర్చుని వెనక్కి ఒరిగి కూర్చుంది. నిద్రమత్తులో కూడా ఉంది. ఈ స్థితిలో కారును నిర్మానుష్యమైన ప్రదేశంలో డ్రైవర్ ఆపాడు. అది గమనించి దిగడానికి ప్రయత్నించింది. అయితే, డోర్స్ లాక్ చేసి ఉన్నాయి. ఆమె కేకలు వేసింది. కానీ డ్రైవర్ ఆమెను వెనక్కి తోసి అత్యాచారం జరిపాడని పోలీసులు తెలిపారు.

లైసెన్స్ లేని క్యాబ్ సంస్థలపై చర్యలు
అనుమతిలేని క్యాబ్ లపై దాడి
ఆర్టిఎ అధికారులు తనిఖీలు

English summary
A week before a 26-year-old executive was allegedly raped by Uber cab driver Shiv Kumar Yadav in Delhi, another woman took to Twitter to come out with a rather unpleasant ride with the same driver.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X