భారత సైనికుల తలలు నరికిన పాక్ ఉగ్రవాది హతం

శ్రీనగర్: ఆ ఉగ్రవాదిపై భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. 2013లో ఇద్దరు భారత సైనికుల తలలు నరికి చంపిన పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిని భారత సైన్యం మట్టుపెట్టింది. లష్కర్‌-ఈ-తైబాకు చెందిన ఉగ్రవాది అన్వర్‌ ఫైజ్‌ను జమ్మూకశ్మీర్‌లో భారత సైన్యం ఈ వారంలో చంపేసింది.

రాజౌరీ ప్రాంతంలో జులై 13న అన్వర్‌ మరో ముగ్గురు ఉగ్రవాదులతో కలిసి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా సైన్యం అతడిని హతమార్చినట్లు తెలుస్తోంది. అతడి వద్ద నుంచి ఏకే-47, భారత్‌, పాక్‌ల కరెన్సీ, వైర్‌ కట్టర్స్‌, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

 Naik Hemraj

2013 జనవరి 8వ తేదీన భారత సైనికులు లాన్స్‌ నాయక్‌ హేమరాజ్‌ సింగ్‌, సుధాకర్‌సింగ్‌లను హతమార్చిన ఉగ్రవాదులలో అన్వర్‌ కూడా ఉన్నాడని సైనిక వర్గాలు పేర్కొన్నాయి.

కాగా, ఉగ్రవాది మృతి వార్త విని హేమరాజ్ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
ఆ ఉగ్రవాది తలను తమకు అప్పగించాలని హేమరాజ్ సింగ్ కుటుంబసభ్యులు డిమాండ్ చేసినట్లు తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+