వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టూ ఫ్రంట్ వార్‌కి భారత్ సిద్దం... చైనా మనల్ని తట్టుకోలేదు... ఎయిర్‌ఫోర్స్ చీఫ్ కీలక ప్రకటన...

|
Google Oneindia TeluguNews

ఇటు ఎల్‌ఏసీ వెంబడి చైనాతో... అటు ఎల్ఓసీ వెంబడి పాకిస్తాన్‌తో భారత్ ఏకకాలంలో ఇద్దరు శత్రువుల దాడులను ఎదుర్కొంటోంది.ఓవైపు తూర్పు లదాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా ఇంకా అదనపు బలగాలను,ఆయుధాలను మోహరిస్తూనే ఉంది.మరోవైపు పాకిస్తాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లఘిస్తోంది. గత 17 ఏళ్లలో మునుపెన్నడూ లేనంతగా పదేపదే కాల్పులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురి దాడులను తిప్పికొట్టేలా భారత్ యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. అవసరమైతే టూ ఫ్రంట్ వార్‌కు కూడా సిద్దపడేలా సరిహద్దుల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ బదౌరియా ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు.

చైనా గుండెలో పిడుగు: ఎల్ఏసీ వద్ద సరికొత్త నిర్భయ్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ - నిశబ్ధ విధ్వంసంచైనా గుండెలో పిడుగు: ఎల్ఏసీ వద్ద సరికొత్త నిర్భయ్ మిస్సైల్‌ను మోహరించిన భారత్ - నిశబ్ధ విధ్వంసం

ప్రీ-ప్లాన్డ్‌గా భారత్... చైనా మనను తట్టుకోలేదు...

ప్రీ-ప్లాన్డ్‌గా భారత్... చైనా మనను తట్టుకోలేదు...

సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కొనేందుకు భారత్ సిద్దంగా ఉందన్న బదౌరియా... చైనా,పాకిస్తాన్‌లను ఎదుర్కొనేందుకు టూ ఫ్రంట్ వార్‌కి కూడా సిద్దమేనని ప్రకటించారు. సరిహద్దుల్లో సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ ప్లీప్లాన్డ్‌గా ఉందన్నారు. భారత వాయుసేన ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంగా ఉందని... చైనా మన శక్తి సామర్థ్యాలను ఎదుర్కోలేదని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో చైనాను అంత తేలిగ్గా కూడా తీసుకోమని స్పష్టం చేశారు. భవిష్యత్ పోరాటంలో భారత్ తరుపున ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

శత్రువు సైతం ఆశ్చర్యపోయే శక్తి సామర్థ్యాలు

శత్రువు సైతం ఆశ్చర్యపోయే శక్తి సామర్థ్యాలు


'విరోధి సైతం ఆశ్చర్యానికి గురయ్యే స్థాయిలో మన శక్తి సామర్థ్యాలు ఉన్నాయి.రాఫెల్ రాకతో భారత వాయుసేన మరింత బలోపేతమైంది. యుద్ద పరిస్థితులను ఎదుర్కోవడంలో ఇది కచ్చితంగా భారత్‌కు కలిసొచ్చే అంశం. సరిహద్దులో చోటు చేసుకుంటున్న పరిణామాలు,శత్రు దేశాల నుంచి ఎదురవుతున్న ముప్పును విచ్చిన్నం చేసే శక్తి భారత్‌కు ఉంది.భాతర వైమానిక దళం అత్యంత వేగంగా మార్పు చెందుతోంది.' అని బదౌరియా పేర్కొన్నారు.

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా...

రక్షణ రంగంలో స్వావలంబన దిశగా...


లదాఖ్‌లో చైనాను ఎదుర్కొనేందుకు భారత బలగాలను సరైన స్థానాల్లో మోహరించామని బదౌరియా తెలిపారు. గగనతలంలో వాయుసేన వేగంగా బలగాలను మోహరించామన్నారు. లదాఖ్‌లో రాబోయే 3 నెలలు ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్నది భారత్-చైనా మధ్య జరుగుతున్న చర్చల పురోగతి పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఇప్పటికైతే ఆ ప్రక్రియ నెమ్మదిగానే సాగుతోందని... ఏదేమైనా సరిహద్దులో అవసరమైన అన్నిచోట్ల ఇప్పటికే బలగాలను మోహరించామని చెప్పారు. రాబోయే మూడేళ్లలో రాఫెల్&ఎల్‌సీఏ మార్క్ 1 స్క్వాడ్రన్ ఆపరేషన్ పూర్తి స్థాయిలో జరుగుతుందన్నారు. రక్షణ రంగంలో స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.

అటు చైనా... ఇటు పాక్...

అటు చైనా... ఇటు పాక్...


ఈ ఏడాది జూన్ 25న తూర్పు లదాఖ్‌లో భారత్-చైనా మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యం ఉపసంహరింపుకు,ఉద్రిక్తతలను తగ్గించడానికి ఓవైపు చర్చలు జరుగుతున్నా పెద్దగా పురోగతి కనిపించట్లేదు. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఇటీవలి కాలంలో పాకిస్తాన్ దూకుడుగా వ్యవహరిస్తోంది. గత 17ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కాల్పుల విరమణ ఒప్పందానికి పదేపదే తూట్లు పొడుస్తోంది. దీంతో అవసరమైతే టూ ఫ్రంట్ వార్‌కైనా సిద్దమని ఎయిర్‌ఫోర్స్ ప్రకటించింది.

Recommended Video

COVID-19 : Coronavirus vaccine పై కేంద్రం ప్లాన్.. జులై నాటికి 25 కోట్ల మందికి వ్యాక్సిన్!

English summary
IAF chief Air Chief Marshal Rakesh Kumar Singh Bhadauria on Monday said that the Indian Air Force is ready for any possible conflict including a two-front war.The Chief of Air Staff made the statement when asked whether the Indian Air Force is ready for a two-front war with Pakistan and China.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X