బర్దన్ కు బ్రతికుండగానే దండం పెట్టిన మమతా బెనర్జీ
కోల్ కతా: ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ సీనియర్ నాయకుడు ఏబీ. బర్దన్ కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించి అందరిని షాక్ గురి చేశారు. మమతా బెనర్జీ అధికారిక ట్వీట్టర్ లో సంతాపం ప్రకటించడంతో సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
బర్దన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగానే ఆమె సంతాపం ప్రకటించారు. తరువాత పొరపాటు తెలుసుకున్న వెంటనే ఈ ట్వీట్ ను తొలగించారు. బర్దన్ మృతికి సంతాపంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ విదంగా ట్వీట్ చేశారు.

బర్దన్ ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా, ఆయన చాలకాలం పాటు కార్మిక సంఘాలలో పని చేశారు, అనేక సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారని ఆయన మరణం అందరికి తీరని లోటు అని అన్నారు.
బర్దన్ మరణం పట్ల ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు సంతాపం తెలుపుతున్నానని మమతా బెనర్జీ ట్వీట్ చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బర్దన్ ఢిల్లీలోని జీబీ పంత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పిన సమయంలోనే ఈ ట్వీట్ బయటకు వచ్చింది. ఇప్పటికే కొందరు ఈ ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టారు.












Click it and Unblock the Notifications