Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మమతా బెనర్జీ తలకు తీవ్రగాయం

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్​ ముఖ్యమంత్రి, తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ తలకి తీవ్ర గాయమైంది. ఆమె నుదుటి గాయానికి సంబంధించిన ఫొటోలను టీఎంసీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)​ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దీదీ కోలుకోవాలంటూ ప్రార్థించాలని విజ్ఞప్తి చేసింది. అయితే కాళీఘాట్​‌లోని తన నివాసంలోనే​ మమత గాయపడినట్లు సమాచారం.

తన గదిలో నుంచి బయటకు వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు మమతా బెనర్జీ కిందపడి గాయపడ్డట్లు తెలిసింది. అయితే వెంటనే మమతను చికిత్స కోసం కోల్​‌క‌తాలోని ఎస్‌ఎస్‌కేఎం ఆస్పత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆస్పత్రిలోని వుడ్‌​బర్న్​ బ్లాక్​ నుంచి ట్రామా కేర్​ సెంటర్‌​కు తరలించారు. ప్రస్తుతం దీదీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

West bengal CM Mamata Banerjee suffers major injury in accident TMC

ముఖ్యమంత్రి మమత బెనర్జీ వీలైనంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్‌ ట్వీట్‌ చేశారు. పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. కోల్‌​కతా నగర మేయర్​ ఫిరాద్​ హకీం తోపాటు ఇతర పార్టీ నేతలు ఆస్పత్రికి వెళ్లి మమతను పరామర్శించారు. మమత పార్టీ నేతలు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది జనవరిలోనూ ఓ కారు ప్రమాదంలో మమతా తలకు స్వల్ప గాయమైంది. అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం బర్ధమాన్‌ నుంచి కోల్‌కతాకు తిరిగి వస్తుండగా ఆమె కాన్వాయ్‌కు ఎదురుగా ఉన్నట్టుండి మరో వాహనం రావడం వల్ల దాన్ని తప్పించేందుకు డ్రైవర్‌ కారుకు బ్రేక్‌ వేశాడు. దీంతో ముందు సీట్లో కూర్చున్న సీఎం విండ్‌షీల్డ్‌కు ఢీకొనడం వల్ల తలకు స్వల్ప గాయమైనట్టు అధికారులు తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+