ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ఇకపై బార్లలో మహిళలు పనిచేయొచ్చని రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బార్లలో మహిళలు పనిచేసేందుకు అనుమతించే బిల్లుకు బెంగాల్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బెంగాల్ ఎక్సైజ్ యాక్ట్- 1909ను సవరిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఈ చట్టం ఆటంకంగా మారిందని బెంగాల్ మంత్రి చంద్రిమ భట్టాచార్య అభిప్రాయ పడ్డారు. ఈ చట్టం వివక్షతతో కూడుకున్నదని.. అందుకే చట్ట సవరణ చేసినట్టు పేర్కొన్నారు. ఉపాధి అవకాశాల్లో ఆడ, మగ అని విబేధాలు తమ ప్రభుత్వానికి లేవని అన్నారు.

ఇక ఈ బిల్లు తక్షణమే బెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు భట్టాచార్య తెలిపారు. సవరించిన బిల్లు ప్రకారం.. నాటు సారా తయారీని నిరోధించేందుకు బెల్లంతో సహా ఇతర ముడి పదార్ధాలపై పర్యవేక్షణ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు.
ఈ బిల్లుతోపాటు వ్యవసాయ ఆదాయపు పన్ను చట్టం- 1944ను కూడా సవరించనుంది మమతా బెనర్జీ ప్రభుత్వం. కొవిడ్-19 తర్వాత నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తేయాకు పరిశ్రమ, తేయాకు తోటలకు పన్ను నుంచి ఉపశమనం కల్పించేందుకు ఈ చట్టాన్ని సవరించారు.












Click it and Unblock the Notifications