ఇదేందయ్యా ఇది.. లీవ్ ఇవ్వలేదని ప్రభుత్వోద్యోగి కత్తితో హల్ చల్.. రోడ్డుపై వీరంగం

ఉద్యోగులకు లీవ్స్ ఉండటం సహజమే. ఏదైనా అత్యవసర పని ఉన్నప్పుడు అటు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఇటు ప్రైవేట్ కార్యాలయాల్లోనూ ఉద్యోగులు లీవ్స్ పెట్టడం చూస్తుంటాం. ఒకవేళ లీవ్ దొరకకపోతే ప్లాన్స్ మార్చుకుంటాం. ఇంతే అని సర్దుకుపోతాం. కానీ బెంగాల్ కు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి మాత్రం వింతగా ప్రవర్తించాడు. లీవ్ ఇవ్వలేదని రెచ్చిపోయాడు. ఆఫీస్ లో బీభత్సం సృష్టించాడు. సహోద్యోగులపై ఏకంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. అలాగే ఆఫీస్ బయటకు వచ్చి రోడ్లపై ఉన్న జనాన్ని కత్తితో బెదిరించాడు. కొద్దిసేపు ఆ ప్రాంతంలో నానా హైరానా సృష్టించాడు. ఆయన చేతిలోని కత్తిని చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఏం జరిగింది..?

వెస్ట్ బెంగాల్ లోని కోల్ కతా న్యూ టౌన్ ఏరియాలోని కరిగోరి భవన్ లో అసిత్ సర్కార్ అనే ఉద్యోగి విధులు నిర్వర్తిస్తున్నాడు. ఏదో పనిమీద సర్కార్ లీవ్ కోసం అప్లై చేశాడు. అయితే ఆయన అభ్యర్థనను పైస్థాయి అధికారులు తిరస్కరించారు. దీంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన సర్కార్.. కార్యాలయంలోని తోటి ఉద్యోగులతో వాగ్వాదానికి దిగాడు. తన దగ్గర ఉన్న కత్తితో ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడు. ఆఫీస్ లోని సెక్యూరిటీ గార్డును సైతం గాయపరిచాడు. ఆ తర్వాత కార్యాలయం బయటకు వచ్చి.. రోడ్డుపై వచ్చిపోయే ప్రజలకు కత్తి చూపిస్తూ భయపెట్టాడు. విషయం తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు సర్కార్ ను అరెస్ట్ చేశారు.

West Bengal Shocker Government Employee Attacks Colleagues with Knife After Leave Denial

" అసిత్ సర్కార్, 24 నార్త్ పరగాణా జిల్లాలోని ఘోలా అనే ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయన టెక్నికల్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంట్ లో విధులు నిర్వర్తిస్తున్నాడు. లీవ్ ఇవ్వలేదన్న కోపంతో సహోద్యోగులపై సర్కార్ కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో జయేబ్ చక్రవర్తి, శాంతను సాహా, శార్థా లేట్, షేక్ సతాబుల్ ఉద్యోగులు గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మేము సర్కార్ ను అరెస్ట్ చేశాం." అని పోలీస్ అధికారి తెలిపారు.

మరోవైపు.. తన తండ్రిపై అసభ్య కామెంట్స్ చేయడం వల్లే ఉద్యోగులపై దాడికి పాల్పడినట్లు సర్కార్ విచారణలో తెలిపాడని పోలీసులు చెప్పారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+