వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ ఎఫ్‌టీఎక్స్ పతనానికీ, భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్‌కు సంబంధం ఏంటి?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
సామ్ బ్యాంక్‌మాన్ ఫ్రీడ్, నిషాద్ సింగ్

ప్రపంచంలో రెండో అతిపెద్ద క్రిస్టో ఎక్స్‌చేంజ్ కంపెనీ ఎఫ్‌టీఎక్స్ వారం రోజుల్లోనే ఘోరంగా పతనమైంది. క్రిప్టో కింగ్‌గా పిలుచుకునే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ సామ్ బ్యాంక్‌మాన్ ఫ్రీడ్.. సంస్థ సీఈవో పదవికి రాజీనామా చేశారు.

మరోవైపు ఎఫ్‌టీఎక్స్‌ను కొనుగోలు చేసేందుకు ప్రత్యర్థి సంస్థ బియాన్స్ కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది.

బిలియనీర్ అయిన సామ్ ప్రస్తుతం విచారణను ఎదుర్కొంటున్నారు. తమను దివాలా తీసిన సంస్థగా ప్రకటించాలని కోర్టుకు ఎఫ్‌టీఎక్స్ అభ్యర్థన పెట్టుకుంది.

అయితే, ఇప్పుడు సామ్‌తోపాటు మరికొంతమంది విచారణను ఎదుర్కొంటున్నారు. వీరిలో నిషాద్ సింగ్ ఒకరు. రెండో అతి పెద్ద క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ దివాలా తీయడం వెనుక ఆయన ఉన్నారని వార్తలు వస్తున్నాయి.

అసలు ఈ వివాదం ఏమిటి? దీనిలోకి భారత సంతతి వ్యక్తి నిషాద్ సింగ్ ఎలా వచ్చారు? ఆయనపై వస్తున్న ఆరోపణలు ఏమిటి?

బిట్ కాయిన్ దూసుకుపోతోంది... నెల రోజుల్లో రూ. 14 లక్షల నుంచి 24 లక్షలకు పెరిగిన విలువ

ఇరీడియం: బంగారం, ప్లాటినం కంటే ఇది ఖరీదైంది.. ఎందుకో తెలుసా..

అసలేం జరిగింది?

నవంబర్ 10 ఉదయం కోటీశ్వరుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్‌మాన్ ఫ్రీడ్... అదే రోజు రాత్రికి తన సంపదలో 90 శాతం నష్టపోయి ఆ జాబితాలోంచి అదృశ్యం అయ్యారు.

కింగ్ ఆఫ్ క్రిప్టో, క్రిప్టోస్ వైట్ నైట్‌గా పిలుచుకునే ఫ్రీడ్ ఎఫ్‌టీఎక్స్ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

అమెరికన్ ఫెడరల్ ఏజన్సీలు ఇప్పుడాయన మీద, ఆయన సంస్థలో జరిగిన అక్రమాల మీద దర్యాప్తు జరుపుతున్నాయి.

ఇటీవల ఈ సంస్థ విలువ 32 బిలియన్ డాలర్లుగా (రూ.2.59 లక్షల కోట్లుగా) తేలింది. ఇది కొన్ని దేశాల ఆర్థికవ్యవస్థల కంటే అనేక రెట్లు ఎక్కువ.

బిట్ కాయిన్ ట్రేడింగ్ నైజీరియాలో జోరుగా సాగడానికి కారణమేంటి?

బిట్ కాయిన్లు: అప్పుడు నిషేధించారు... ఇప్పుడు దూసుకుపోతున్నాయి...

బిట్‌కాయిన్

క్రిప్టో కింగ్‌గా ఎదిగిన గూగుల్ మాజీ ఉద్యోగి

గూగుల్‌ సంస్థలో ఉద్యోగం మానేసిన తర్వాత సామ్ బాంక్‌మాన్ ఫ్రీడ్ 2017లో కాలిఫోర్నియా రాష్ట్రంలోని బర్కిలీలో అల్మెడా రీసర్చ్ పేరుతో ట్రేడింగ్ సంస్థను స్థాపించారు.

అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్‌ వాల్ స్ట్రీట్‌లో షేర్ల వ్యాపారం చేశారు. 2019లో షేర్ల వ్యాపారాన్ని వదిలేసి బహమాస్ కేంద్రంగా గేరీ వాంగ్‌తో కలిసి ఎఫ్‌టీఎక్స్‌ను స్థాపించారు.

ఎఫ్‌టీఎక్స్ అంటే ఫ్యూచర్ ఎక్స్‌చేంజ్. ఈ సంస్థకు పన్నెండు లక్షల మందికి పైగా యూజర్లు ఉన్నారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పుంజుకుంటున్న సమయంలో పుట్టిన ఈ సంస్థకు.. పది రోజుల కిందటి వరకూ ప్రపంచంలోనే రెండో అతి పెద్ద సంస్థగా గుర్తింపు ఉంది.

గతేడాది సెప్టెంబర్‌లో ఫార్ములా వన్ రేస్‌లో మర్సిడిస్‌ను స్పాన్సర్ చేస్తూ ఒప్పందం కూడా చేసుకుంది ఎఫ్‌టీఎక్స్.

బిట్ కాయిన్

ఆకాశమే హద్దుగా విస్తరణ

2021 అక్టోబర్ నాటికి ఈ క్రిప్టో ఎక్స్‌చేంజ్ సంస్థ విలువ 25 ట్రిలియన్ డాలర్లకు(రూ.2029 లక్షల కోట్లు) చేరుకుంది. దీంతో సంస్థ కార్యాలయాలు బహమాస్‌తో పాటు హాంగ్‌కాంగ్, అమెరికాలోనూ తెరిచారు.

సింగపూర్‌కు చెందిన టీమ్‌సెక్, టైగర్ గ్లోబల్ సహా అనేక సంస్థలు ఇందులో పెట్టుబడులు పెట్టాయి. చిన్న సంస్థల్ని టేకోవర్ చెయ్యడం, పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు, బడా సంస్థల పెట్టుబడులు.. బ్యాంక్‌మాన్ ఫ్రీడ్ ఫోర్బ్స్ పత్రిక ఫ్రంట్ పేజ్ మీదకు వచ్చారు.

పెట్టుబడుల సలహాలు ఇవ్వడంలో అమెరికాలో వారెన్ బఫెట్ తర్వాత అంత క్రేజ్ ఉన్న సంపన్నుడిగా మారారాయన. పుట్టిన మూడేళ్లకే ఆకాశమంత ఎత్తుకి ఎదిగిన ఈ సంస్థ వ్యాపారం.. అత్యంత నాటకీయంగా వారం రోజుల్లో కుప్పకూలింది.

బిట్‌కాయిన్‌: క్రిప్టో కరెన్సీ లావాదేవీలను నిలిపేయాలంటూ బ్యాంకులకు చైనా ఆదేశం

క్రిప్టో కరెన్సీ చరిత్రలోనే అతి పెద్ద దోపిడీ, రూ. 4,455 వేల కోట్ల విలువైన డిజిటల్ టోకెన్ల చోరీ

బిట్‌కాయిన్

వారం రోజుల్లోనే...

ఎఫ్‌టీఎక్స్ వ్యవహారం కూడా అనేక ఇతర స్కాముల్లాగానే బయటపడింది. తమ సంస్థలో పెట్టుబడులకు ప్రభుత్వ ఇన్షూరెన్స్ ఉందని ఎఫ్‌టీఎక్స్ ప్రచారం చెయ్యడంతో ఈ ఏడాది ఆగస్ట్ 19న అమెరికన్ బ్యాంక్ రెగ్యులేటర్ ఎఫ్‌టీఎక్స్‌కు వార్నింగ్ ఇచ్చింది.

ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రకటనలు తక్షణం ఆపేయాలని ఆదేశించింది. బ్యాంక్‌మాన్ ఫ్రీడ్‌కు చెందిన అల్మెడా రీసర్చ్ ఎఫ్‌టీఎక్స్ నేటివ్ కాయిన్ మీద ఆధారపడిందన్న బ్యాలెన్స్ షీట్ లీకైనట్లు రెండు వారాల క్రితం క్రిప్టో న్యూస్ వెబ్‌సైట్ కాయిన్ డెస్క్ రిపోర్ట్ చేసింది.

ఇది జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌టీఎక్స్‌లో తమ లావాదేవీల్ని నిలిపివేస్తున్నట్లు బినాన్స్ సీఈఓ చాంగ్‌పెంగ్ జావో ప్రకటించారు. ఎఫ్‌టీఎక్స్ నుంచి వేల కోట్లు అనుమానిత పరిస్థితుల్లో దారి మళ్లాయన్న వార్తలతో క్రిప్టో మార్కెట్‌లో సంచలనం బద్దలైంది.

ట్రేడింగ్ చేస్తున్న చిట్టెలుక.. వారెన్ బఫెట్ కంపెనీ కంటే ఎక్కువ లాభాల శాతం

ఫేస్‌బుక్ డిజిటల్ కరెన్సీ సేఫ్ కాదా? క్రిప్టో కరెన్సీతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమా...

నిషాద్ సింగ్ ఎందుకు?

ఇక ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంక్‌మాన్ ఫ్రీడ్ తర్వాత బాగా వినిపిస్తున్న పేరు భారతీయ సంతతికి చెందిన నిషాద్ సింగ్.

2019 ఏప్రిల్ నుంచి నిషాద్ ఈ సంస్థ ఇంజనీరింగ్ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. అంతకు ముందు అల్మెడా రీసర్చ్‌లోనూ ఇవే బాధ్యతలు నిర్వహించారు. ‌

బ్యాంక్‌మాన్ ఫ్రీడ్ రహస్యంగా 8వేల కోట్ల రూపాయలను ఎఫ్‌టీఎక్స్ ట్రేడింగ్ కంపెనీ నుంచి అల్మెడా రీసర్చ్‌కు బదిలీ చేసినట్లు రాయిటర్స్ వెల్లడించింది.

ఇందులో ఫ్రీడ్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నిషాద్ సింగ్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. నిషాద్, ఫ్రీడ్ ఒకే ఇంట్లో ఉంటున్నారని, ఎఫ్‌టీఎక్స్‌లో జరిగిన అక్రమాల వెనుక నిషాద్ పాత్ర ఉన్నా లేకున్నా.. ఆయనకు కచ్చితంగా సమాచారం ఉంటుందని కాయిన్ డెస్క్ రిపోర్ట్‌లో పేర్కొంది.

ఎఫ్‌టీఎక్స్ క్రిప్టో ఎక్స్‌చేంజ్ కోడ్‌తో పాటు నిధుల నిర్వహణను ఫ్రీడ్, గేరీ వాంగ్‌, నిషాద్ కలిసి నియంత్రిస్తారని కాయిన్ డెస్క్ పేర్కొంది.

పేటీఎం షేర్ ధర మొదటిరోజునే ఎందుకు కుప్పకూలింది... ఈ ఐపీఓ నేర్పే పాఠాలేంటి?

IPO అంటే ఏమిటి? దరఖాస్తు చేసిన వారందరికీ షేర్లు కేటాయిస్తారా? కేటాయించకపోతే ఏం చేయాలి?

క్రిప్టో కరెన్సీ సేఫేనా?

ఇన్వెస్టర్లకు విత్‌డ్రా ఆపేసిన తర్వాత ''నన్ను క్షమించండి. మళ్లీ పూర్వస్థితికి వచ్చే మార్గాలు వెదుకుతున్నాను’’ అంటూ మాజీ సీఈఓ సామ్ బ్యాంక్‌మాన్ ఫ్రీడ్ ట్వీట్ చేశారు.

డిజిటల్ కరెన్సీ ప్రపంచంలో అతి పెద్ద రెండో సంస్థ వారం రోజుల్లోనే కూలిపోగానే... క్రిప్టో మార్కెట్ షేకయింది. ఏడాది క్రితం 56 లక్షల రూపాయలున్న క్రిప్టో విలువ.. ప్రస్తుతం 13 లక్షల రూపాయలకు పడిపోయింది.

ఎఫ్‌టీఎక్స్ వ్యవహారం వెలుగులోకి రావడానికి ముందే క్రిప్టో మార్కెట్ 2 ట్రిలియన్ డాలర్లు నష్టపోయింది. అయితే, క్రిప్టో కరెన్సీ కూడా స్టాక్ మార్కెట్‌ లాంటిదేనని.. కాబట్టి అందులో పెట్టుబడి పెట్టేముందు క్షుణ్ణంగా అధ్యయనం చెయ్యడం అవసరమని ఆర్థిక నిపుణుడు పాపారావు బీబీసీతో చెప్పారు.

ఎల్ సాల్వడర్ క్రిప్టోను అధికారిక కరెన్సీగా ప్రకటించి.. భారీగా క్రిప్టోలను కొనుగోలు చేసి.. ఆ తర్వాత నష్టపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టిన వారందరినీ ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న ఒక్కటే - ఫ్యూచర్ ఎక్స్చేంజ్ పతనం తర్వాత వంతు ఎవరిది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What does the collapse of crypto exchange firm FTX have to do with Nishad Singh, a man of Indian origin?
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X