వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషం కలిపారేమో?: పోలీసులు ఇచ్చిన ‘టీ’ని నిరాకరించిన అఖిలేష్ యాదవ్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. పార్టీ కార్యకర్త మనీష్ జగన్ అగర్వాల్‌ను అరెస్ట్ చేయడంతో.. పోలీసుల వైఖరిని నిరసిస్తూఅఖిలేష్ యాదవ్ పోలీస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా అఖిలేష్ యాదవ్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

అనంతరం, పోలీసులు అఖిలేష్ యాదవ్‌కు టీ అందించారు. అయితే, ఆ టీని తాగేందుకు ఆయన నిరాకరించారు. ఆ టీలో విషం కలిపివుంటారేమోనని అఖిలేష్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి వారంతా కొంత షాక్ కి గురయ్యారు. ఈ వ్యవహారం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.

What if its poisoned?: Akhilesh Yadav refuses tea at police Headquarters

కాగా, స్వామి ప్రసాద్ మౌర్య నేతృత్వంలో సమాజ్‌వాదీ పార్టీ కార్యకర్తలు మనీష్ జగన్ అగర్వాల్‌ను విడుదల చేయాలని కోరుతూ డీజీపీ ప్రధాన కార్యాలయం గేట్ నంబర్ టూ వెలుపల నిరసన చేపట్టారు.

లక్నోలోని పోలీసు ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన తర్వాత, మనీష్ అగర్వాల్‌ను కలిసేందుకు అఖిలేష్ యాదవ్ గోసాయిగంజ్ జిల్లా జైలుకు చేరుకున్నారు.

పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్విట్టర్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు మనీష్ జగన్ అగర్వాల్‌పై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మూడు కేసులు నమోదైన తర్వాత లక్నో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

మనీష్ జగన్ అగర్వాల్ అరెస్టును పార్టీ ట్విట్టర్‌లో ఖండించింది.

మనీష్ జగన్ అగర్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్‌కు చెందినవారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మూడు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన జగన్నాథ్ ప్రసాద్ అగర్వాల్ కుటుంబ సభ్యుడినని ఆయన పేర్కొన్నారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో జగన్నాథ్ ప్రసాద్ కూడా రాజ్యసభ సభ్యుడు.

English summary
What if it's poisoned?: Akhilesh Yadav refuses tea at police Headquarters
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X