భార్య టార్చర్ తట్టుకోలేక భర్త ఏం చేశాడంటే, దీన్ని శాశ్వతంగా వదిలించుకోవాలని ప్లాన్, అయితే ?

భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అయితే పాత తెలుగు సినిమాల్లో రాక్షసిలాగా ప్రవర్తించే సూర్యకాంతం లాగా అతని భార్య తయారైయ్యింది.

భువనేశ్వర్/ముంబాయి/చెన్నై: కుటుంబ సభ్యులు చూపించిన అమ్మాయిని అతను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత భర్త అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు. అయితే పాత తెలుగు సినిమాల్లో రాక్షసిలాగా ప్రవర్తించే సూర్యకాంతం లాగా అతని భార్య తయారైయ్యింది. భార్య టార్చర్ తట్టుకోలేక ఆమె భర్త విసిగిపోయాడు. కొంతకాలం తరువాత ఓ వ్యక్తి భర్త కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి మీ అబ్బాయిని ఎవరో హత్య చేశారని అతని వీడియో చూపించడం కలకలం రేపింది. అయితే పోలీసుల ఎంట్రీతో అసలు మ్యాటర్ ?

భార్యతో హ్యాపీగా ఉన్నాడు

భార్యతో హ్యాపీగా ఉన్నాడు

ఒడిశాలోని దక్షిణ గజపతి జిల్లాలోని శరత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యులు చూపించి ర్మి (పేరు మార్చడం జరిగింది) అనే యువతిని శరత్ వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తరువాత శరత్, రష్మీ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. మంచి భార్య చిక్కిందని శరత్ కొంతకాలం మురిసిపోయాడు.

భర్త అంటే ఏమాత్రం లెక్కలేదు

భర్త అంటే ఏమాత్రం లెక్కలేదు

వివాహం జరిగిన రెండు సంవత్సరాల తరువాత శరత్ భార్య రష్మీ ఆమె అసలు స్వరూపం చూపించింది. భర్త శరత్ అంటే ఏమాత్రం లెక్కలేకుండా, అతనిమాటకు విలువ ఇవ్వకుండా రష్మీ ప్రవర్తించింది. భర్త శరత్ బయటకు వెళ్లిన తరువాత ఎప్పుడుపడితే అప్పుడు బయటకు వెలుతున్న రష్మీ ఆమె ఆడింది ఆటగా, పాడింది పాటగా తయారైయ్యింది. భర్త అంటే ఏమాత్రం మర్యాదలేకుండా రష్మీ ప్రవర్తించిందని తెలిసింది.

శరత్ సెల్ఫ్ గోల్

శరత్ సెల్ఫ్ గోల్

రానురాను భర్త శరత్ మీద రష్మీ దాడి చెయ్యడం మొదలుపెట్టిందని తెలిసింది. భార్య టార్చర్ తట్టుకోలేని శరత్ ఇంటి నుంచి పారిపోయాడు. కకొనని రోజుల తరువాత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసిన ఓ వ్యక్తి మీ అబ్బాయి శరత్ ను ఎవరో హత్య చేశారని శరత్ శరీరం మీద రక్తపు మరకలు ఉన్న వీడియో చూపించారు. శరత్ ను ఎవరో హత్య చేశారని అతని కుటుంబ సభ్యులు ఒడిశాలో కేసు పెట్టారు.

ఏం స్కెచ్ వేశాడంటే ?

ఏం స్కెచ్ వేశాడంటే ?

పోలీసులు రంగంలోకి దిగారు. శరత్ ను హత్య చేశారని వీడియో కాల్ ఎక్కడి నుంచి వచ్చింది ? అని పోలీసులు ఆరా తీశారు. శరత్ మొబైల్ నుంచి వచ్చిన వీడియో తమిళనాడులో చిత్రీకరించలేదనని, ముంబాయిలో తీశారని గుర్తించిన పోలీసులు ముంబాయి వెళ్లారు. తరువాత శరత్ మొబైల్ నెంబర్ ను ట్రేస్ చేసిన పోలీసులు అతన్ని అదుపులో తీసుకున్నారు. తన భార్య టార్చర్ తట్టుకోలేక ఆమెకు శాశ్వతంగా దూరం కావాలని తాను హత్యకు గురైనట్లు ఓ వీడియో చిత్రీకరించి తన కుటుంబ సభ్యులకు పంపించానని శరత్ అంగీకరించాడని పోలీసులు అన్నారు.

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

ఏదో అనుకుంటే ఏదో జరిగింది

భార్య టార్చర్ తో హత్య జరిగిందని కుటుంబ సభ్యులను మోసం చెయ్యడమే కాకుండా పోలీసులను తప్పుదోవ పట్టించిన శరత్ మీద కేసు నమోదు చేసి అతన్ని జైలుకు పంపించామని ఒడిశా పోలీసులు చెప్పారు. భార్య పోరు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించిన శరత్ చివరికి జైలుపాలుకావడంతో ఆతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+