వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పిల్లలు సంతోషంగా ఉండాలంటే తల్లి ఏం చేయాలి? ‘సూపర్ మామ్‌’గా ఉండటం కరెక్టేనా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
అమ్మాయిలు

నేను అక్కాచెల్లెళ్లు లేకుండా పెరిగాను. కానీ, నేను ముగ్గురు పిల్లలకు తల్లిని కావడం మాత్రం అదృష్టంగా భావిస్తాను. నా పిల్లలతో కలిసి చేస్తున్న ప్రయాణం అద్భుతంగా ఉంటుంది.

నా చుట్టూ ఉన్న వారి మాదిరిగానే నేను కూడా ముందుగానే ఏర్పర్చుకున్న కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలతో నా మాతృత్వ ప్రయాణాన్ని ప్రారంభించాను. ఏళ్ళు గడుస్తున్న కొలదీ నా ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని కోల్పోయాను. ఇప్పుడు నాకు తేలికగా ఉంది. మరింత తెలివిగా ఉన్నాను.

నేను నేర్చుకున్న పాఠాలకు ముగింపు లేదు. అవి విరుద్ధంగా ఉంటాయి. అన్ని వేళలా అవి పని చేస్తాయని చెప్పలేను.

నా అనుభవాల ద్వారా నా పిల్లల దగ్గర నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి అయోమయానికి గురైనప్పుడు నేను విశ్రమించాల్సిన అవసరమొచ్చిందని నాకు నేనే గుర్తు చేసుకుంటాను.

అమ్మాయిలు

మేమిద్దరం ముగ్గురు పిల్లల్ని కనాలని ముందుగా అనుకుని కనలేదు. వారు మాకు పుట్టాలని మా విధి రాతలో ఉంది.

మా గురించి మీరేమనుకున్నా నేనేమీ పట్టించుకోను. మేము ప్రాక్టికల్ గా ఆలోచించలేదు. మేము ఆలోచన లేకుండా కొన్ని పనులు చేశామని ఒప్పుకుంటాను. మొత్తం మీద కొన్ని పనులు మూర్ఖంగా అనిపిస్తాయి.

మొదట్లో మా పిల్లలు ముద్దుగా ఉండేవారు. ఆ సమయంలో మా స్నేహితులు కొంత మంది మాకు దూరమయ్యారు.

మా పట్ల ఆసక్తి చూపిస్తూ అత్తలు, పిన్నిలు, అమ్మమ్మలు, నానమ్మలు మా జీవితంలో ఏర్పడిన ఖాళీని పూరించారు. కానీ, అది పూర్తిగా మంచి పని అని అనిపించలేదు.

కానీ, ప్రవాహానికి ఎదురీదితే, అందులో మునిగిపోతాం అని సమయం గడిచే కొలదీ తెలుసుకున్నాను. ఈ ప్రయాణంలో చాలా విషయాలను పట్టించుకోకుండా వదిలేశాను. ఊహించని సంఘటనలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.

మీ జీవితంలో ఏర్పడిన మార్పులను స్వీకరించండి. మీరిప్పుడు చూస్తున్న సినిమాను ఇతరులు గతంలో చూశారు. వారిని మార్గదర్శకం చేయనివ్వండి.

పిల్లలు చాలా త్వరగా ఎదిగిపోతారు. ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే సంవత్సరాలు రోజుల్లా కనిపిస్తాయి.

అమ్మాయిలు

కొన్ని సార్లు రోజులు ఎంతకీ గడవవు. మీ స్నేహితులు వెనక్కి తిరిగి వస్తారు. కొంత మంది ఎప్పటికీ మారరు.

కొన్నేళ్ల తర్వాత కూడా కొంత మంది స్నేహితులు అదే చాకొలెట్ డ్రింక్ ను అదే పాత కెఫె లో తాగుతూ , పాత విషయాలనే మాట్లాడుతూ ఉంటారు. నేను 16ఏళ్ల విరామం తర్వాత వారిని కలిసినా కూడా కేవలం 16 రోజుల తర్వాత కలిసినట్లే నా స్నేహితులు నన్ను స్వీకరిస్తారు.

మొదట్లో మాకు ఇద్దరు పిల్లలున్నప్పుడు టీవీ చానెల్లో నాకిష్టమైన ఒక ఉద్యోగం చేస్తున్నాను.

నా పిల్లలు, ఉద్యోగం కూడా నన్ను ప్రేమించారు. కానీ, ఎందుకో నేను సంతోషంగా ఉండేదానిని కాదు. నా జీవితంలో ఏదో సరిగ్గా లేదనిపించేది. అయోమయం మబ్బులా కమ్మేసింది. నా జీవితంలో మంచి విషయాలన్నింటినీ ఎలా సమన్వయం చేయాలో అర్ధమయ్యేది కాదు.

జీవితంలో అంతకు ముందెప్పుడూ నేనింత ఒంటరిగా ఫీల్ అవ్వలేదు. కానీ, ఒంటరిగా ఫీల్ అవ్వడం మాత్రమే నిజం కాదు. మా జీవితంలో చాలా గందరగోళంతో నిండిపోయింది. పార్టీల గందరగోళం, ఉద్యోగంలో గందరగోళం, ట్రాఫిక్ గందరగోళం...

అమ్మాయిలు

పిల్లలతో కలిసి ఉన్నప్పుడు నా బుర్రలో వేరే ఆలోచనలు మెదిలేవి.

సూపర్ మామ్ గా ఉండాలనే ఆధునిక ఒత్తిడి నాలో ఒక వేడి గాలి బెలూన్ లా ఆక్రమించింది. అన్నీ బాగానే కనిపించేవి. కానీ, నన్నెవరూ అర్ధం చేసుకోవడం లేదని అనిపించేది. జీవితం అద్భుతంగానే ఉండేది కానీ, నాకు చికాకుగా అనిపించేది.

నా నిజాయితీకి తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించడం ఒక పరీక్షలా ఉండేది.

నా పట్ల నేను నిజాయితీగా ప్రవర్తిస్తున్నానా? నాకు పెద్దగా అనుభవం లేదు.

స్నేహితులతో, ట్రెండ్స్ తో, టీవీ షోలు, పరికరాలతో విశ్వాసపాత్రంగా ఉండటం సులభమే. అన్ని సమయాల్లో ప్రశాంతంగా ఉంటూ అందరి ప్రశంసలు ఎలా అందుకోవాలో నాకు తెలుసు.

కానీ, నేను నా అస్థిత్వాన్ని తిరిగి పొందాల్సి ఉంది.

నా అంతర్వాణిని వినడం మొదలుపెట్టాలి.

అమ్మాయిలు

మనల్ని మనం బాగా ఉంచుకోగల్గితేనే, మన పిల్లల్ని మనం బాగా పెంచగలం.

ఈ ప్రాధమిక సూత్రాలు పిల్లలకు, పెద్దలకు ఒకేలా వర్తిస్తాయి. సమయానికి నిద్రపోవడం, సరైన ఆహారం తినడం, ప్రతీ రోజు వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. రద్దీ సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుపోవడాన్ని అలవాటుగా చేసుకోకూడదు.

మీలో దాగిన చిన్న పిల్లల మనస్తత్వాన్ని గారం చేయండి. ప్రేమించండి, ప్రశంసించండి, ఆ చిన్న తనాన్ని సంతోషపెట్టండి.

తల్లితండ్రులు సంతోషకరమైన పిల్లల్లా ప్రవర్తించినప్పుడు, పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు. పిల్లలకు కూడా అదే వర్తిస్తుంది.

పిల్లలు బాగుండకపోతే, నేను కూడా బాగుండనని అనిపిస్తుంది.

పిల్లలు కొత్తగా ఏదైనా తెలుసుకున్నప్పుడు వారు తెలుసుకున్న విజ్ఞానాన్ని మనతో పంచుకోవాలని చూస్తారు.

"అమ్మ విచారంగా ఉంటే దిగులుగా కనిపిస్తుంది. కానీ, నాన్న విచారంగా ఉంటే కోపంగా కనిపిస్తారు" అని మా పెద్ద కూతురు సహర్ వాళ్ళ నాన్నతో ఒక రోజు అంది. వాళ్ళ నాన్న ఈ మాటలు విని చాలా పొంగిపోయారు. ఆయన ఈ మాటలను తన స్నేహితులందరితోనూ చెప్పుకున్నారు. ఒక చిన్న పిల్ల ఇలా మాట్లాడటం పట్ల కొందరు చికాకు కూడా ప్రదర్శించారు.

అలీజా అమాయకత్వాన్ని చూసి నవ్వుకోకుండా ఉండలేం.

అమ్మాయిలు

ఒక తల్లిగా నా బాధ్యతలు నిర్వర్తించడం చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ, మన జీవితాల్లో శాంతిని సృష్టించుకునేందుకు చాలా కష్టపడాలని మనందరికీ తెలుసు.

కలతలు చాలా సులభంగా ఏర్పడతాయి. కానీ, ప్రశాంతత పొందాలంటే చాలా కష్టమైన, కఠినమైన మార్గాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రతీ కుటుంబం నడిచే దారి వేర్వేరుగా ఉంటుంది.

మనం దీర్ఘంగా శ్వాస తీసుకుని విశ్రమించే ప్రదేశాన్ని చేరేందుకు చాలా సామర్ధ్యం అవసరం.

పేరెంటింగ్ అనేది నిరంతర ప్రక్రియ. దీని కంటే కూడా ఉద్యోగం నుంచి దూరంగా వెళ్లడం, ట్రాఫిక్ లో చిక్కుకుపోవడం సులభం.

చాలా మంది తల్లితండ్రులకు సోమవారం అంటే ఇష్టం ఉంటుంది. మీరు ఇంట్లో ఉండే తల్లితండ్రులైతే, ఆ రోజు పిల్లలు స్కూలుకు వెళతారు. మీరు ఇంటి బయట పని చేస్తే అదే రోజు మీరు కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది. చిన్న పిల్లలున్న తల్లి తండ్రులకు సోమవారమే రహస్య శనివారంలా ఉంటుంది.

మన దగ్గర నుంచి పొందిందే పిల్లలు కూడా ఇతరులకు ఇస్తారు. నాలో లోపాలను అర్ధం చేసుకోవడం మొదలుపెట్టి నా శక్తి సామర్ధ్యాలను ఇష్టపడటం మొదలుపెట్టాను.

సమతులాహారం తినడం నాకు బోర్ కొడుతోంది. కానీ, నేను మంచి ఫొటోలు తీస్తాను.

రుచికరమైన భోజనం తినాలనిపించినప్పుడు మార్కెట్ లో ఉన్న దోశ సెంటర్ కు వెళతాం.

అమ్మాయిలు

కొన్ని సార్లు మోమోలు, చాట్, పాప్డీ స్టాల్స్‌కు వెళతాం. కానీ, నా చేతులతో ఫొటోలు తీస్తాను. మాయాజాలం లాంటి ఆ జ్ఞాపకాలు, క్షణాలను మూట కట్టుకుంటాను.

సహర్ చిన్నప్పుడు,"నాకు నానమ్మ చేసే రాజ్మా ఇష్టం, కాంతా పిన్ని చేసిన రొట్టె ఇష్టం, అమ్మ చేసిన మ్యాగీ ఇష్టం అని అనేది".

నేను ప్రశంసలను, ప్రేమను పొగడ్తలను స్వీకరించడం, కృతజ్ఞతతో ఉండటం నేర్చుకున్నాను. నా పిల్లలు చెప్పే మాటలను వినడం మొదలుపెట్టాను. నేను కూడా ముఖ్యమే అని అనుకునేందుకు అనుమతివ్వడం ప్రారంభించాను.

"నువ్వు కూడా ముఖ్యమే. నీ సమక్షం ముఖ్యం" అని నాకు నేనే చెప్పుకుంటాను.

అలా అనుకోవడం ద్వారానే నా పిల్లలు కూడా నాకు ముఖ్యం అని వారికర్ధమయ్యేలా చేస్తాను.

నా మనసు చెప్పే విషయాన్ని వింటాను. నా పిల్లలు చెప్పే విషయాలను వింటాను. ఒక్కొక్కసారి ఫోన్ ఎంత సేపు రింగ్ అయినా కూడా ఫోన్ కాల్స్ తీయకుండా ఊరుకుంటాను. మా అభిప్రాయాల్లో ఏదైనా సంఘర్షణ తలెత్తినప్పుడు ఒకరితో ఒకరు చర్చించుకుంటాం. అవన్నీ పక్షపాత రహితంగా ఉంటాయి.

మేము గతంలో ఎలా ఉండేవాళ్ళమో మా పిల్లలు మాకు గుర్తు చేస్తూ ఉంటారు.

మాలో దాగిన పసితనం, బాల్యం, చిన్నతనాన్ని తిరిగి ఎలా సాధించగలం, ఎలా ఉండగలం అనేది చెబుతారు.

"నాకు అన్నీ తెలుసు. కానీ, మీరే కొన్ని విషయాలు మర్చిపోయారు" అని మా అమ్మాయి ఎలీజా ఒకసారి అంది.

నటాషా బధ్వార్ 'మై డాటర్స్ మమ్ అండ్ ఇమ్మోర్టల్ ఫర్ ఏ మూమెంట్' అనే పుస్తక రచయత. ఆమె చిత్ర నిర్మాత, టీచర్, ముగ్గురు పిల్లల తల్లి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
What should a mother do to keep her children happy? Is it correct to be a 'super mom'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X