ఏక్‌నాథ్ షిండే.. మరో ఉద్ధవ్ థాకరే కాబోతున్నారా?

ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు సంచలనం రేపుతోన్నాయి. మరోసారి అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోన్న శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)ను సంకీర్ణ కూటమి ప్రభుత్వం నుంచి పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు శరద్ పవార్ సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్ధవ్ థాకరే ఉదంతం పునరావృతం కాబోతోందని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను తప్పించి- ఆయన స్థానంలో అజిత్ పవార్ లేదా దేవేంద్ర ఫడ్నవిస్‌ ఆసీనులవుతారని పేర్కొన్నారు.

eknathshindeuddhavthackeray

ముంబైలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ఎన్సీపీ పూర్తిగా అవినీతిమయమైందంటూ అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఎన్సీపీ అవినీతిమయమైనప్పుడు అదే పేరు, గుర్తుతో ఎందుకు రాజకీయాలు చేస్తోన్నారంటూ ప్రశ్నించారు. ఇంకా ఎన్సీపీ జెండా కిందే ఎందుకు మనుగడ సాగిస్తున్నారంటూ నిలదీశారు.

అజిత్ పవార్‌కు పార్టీలో ఏవైనా సమస్యలు ఉండి ఉంటే నా దృష్టికి తీసుకుని రావాల్సింది.. ఎలాంటి ఆలోచనలనయినా పంచుకునే స్వేచ్ఛ ఆయనకు ఉంది.. అని శరద్ పవార్ చెప్పారు. అధికారాన్ని దక్కించుకోవాలనే ఆలోచన తమకు ఎప్పుడూ లేదని, ప్రజలు ఇచ్చే తీర్పును శిరసా వహిస్తామని అన్నారు. అధికారంలో ఉండాలని తాము అనుకుని ఉంటే ఉద్ధవ్ థాకరే ప్రభుత్వమే ఇప్పటికీ కొనసాగి ఉండేదని చెప్పారు.

sharadpawar1

ఈ ఉదయం నిర్వహించిన కార్యవర్గ సమావేశాన్ని శరద్ పవార్ చారిత్రాత్మకమైనదిగా అభివర్ణించారు. దేశం మొత్తం ప్రస్తుతం తమనే చూస్తోందని, ఎలాంటి నిర్ణయాలు వెలువడొచ్చనే విషయాన్ని గమనిస్తోందని అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ ముందుకే సాగుతామని, పార్టీలో సంక్షోభాలు తమకు కొత్తవేమీ కాదని చెప్పారు.

ఎన్సీపీ ఎన్నికల గుర్తు తమ వద్దే ఉందని, అది ఎక్కడికీ పోదని శరద్ పవార్.. పార్టీ నాయకులకు భరోసా ఇచ్చారు. తమను ఆదరిస్తోన్న, అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ వెంటే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని చీల్చాలనే నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్యేలు తమను సంప్రదించలేదని, అజిత్ పవార్ వర్గం ఎలాంటి విధి విధానాన్ని అనుసరించలేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+