వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్‌లో 22లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్; యూజర్లకు వాట్సాప్ హెచ్చరిక ఇదే!!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన మెసేజింగ్ సేవ సంస్థ, ఇన్ స్టంట్ మెసేజింగ్ ప్లాట్ ఫారమ్ వాట్సాప్ జూన్ నెలలో చాలా మంది భారతీయులకు షాకిచ్చింది. దాదాపు జూన్ నెలలో 22 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. వాట్సాప్ ప్రతి నెల కొత్త ఐటీ నిబంధనల మేరకు నివేదికలను విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన జూన్ నెల నివేదికలో యాప్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అందుకు దాదాపు 22 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసినట్టు ప్రకటించింది.

ఇంటర్ సప్లమెంటరీ పరీక్షకు నిముషం లేట్.. పరీక్ష రాయనివ్వలేదని విద్యార్థిని తీవ్రనిర్ణయంఇంటర్ సప్లమెంటరీ పరీక్షకు నిముషం లేట్.. పరీక్ష రాయనివ్వలేదని విద్యార్థిని తీవ్రనిర్ణయం

వాట్సాప్ నెలవారీ నివేదిక.. జూన్ లో ఆ ఖాతాలు బ్యాన్ చేసిన వాట్సాప్

వాట్సాప్ నెలవారీ నివేదిక.. జూన్ లో ఆ ఖాతాలు బ్యాన్ చేసిన వాట్సాప్

నివేదిక ప్రకారం, వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ 1 జూన్ 2022 మరియు 30 జూన్ 2022 మధ్య 22,10,000 చెడు ఖాతాలను నిషేధించింది. ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి)కి అనుగుణంగా వాట్సాప్ నెలవారీ నివేదికను ప్రచురిస్తుంది. నివేదికలో వాట్సాప్ ద్వారా స్వీకరించబడిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యల సమాచారం ఉంది.

జూన్ నెలలో అత్యధికంగా 22 లక్షల అకౌంట్లు బ్యాన్

జూన్ నెలలో అత్యధికంగా 22 లక్షల అకౌంట్లు బ్యాన్


భారతదేశంలోని వినియోగదారులు వాట్సాప్ యొక్క ఫిర్యాదుల మెకానిజమ్‌ల ద్వారా మరియు భారతదేశ చట్టాలను లేదా వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకు చర్యలు తీసుకున్నట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది. అంతకుముందు మే నెలలో వాట్సాప్ 19 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లుగా మెసేజింగ్ ప్లాట్ ఫారం వెల్లడించింది. ఇక ఏప్రిల్ లో 16 లక్షల ఖాతాలను నిషేధించింది.

వాట్సాప్ కు ఫిర్యాదులు .. నివేదికలపై చర్య

వాట్సాప్ కు ఫిర్యాదులు .. నివేదికలపై చర్య


జూన్ నెలలో వాట్సాప్ భారతదేశం నుండి 632 ఫిర్యాదులను స్వీకరించింది. వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ 64 నివేదికలపై చర్య తీసుకుంది. 632 ఫిర్యాదుల నివేదికలలో, 426 నివేదికలు నిషేధ అప్పీల్ కోసం, మిగిలినవి మద్దతు మరియు భద్రత వంటి ఇతర వర్గాల క్రింద ఉన్నాయని వెల్లడించింది. మునుపటి నెల సంఖ్యలను పోల్చి చూస్తే, మే 2022లో, వాట్సాప్ 528 ఫిర్యాదులను స్వీకరించింది మరియు వాటిలో 24 నివేదికలపై చర్య తీసుకుంది.

 యూజర్ ఫిర్యాదులకు ప్రతిస్పందిస్తున్న వాట్సాప్

యూజర్ ఫిర్యాదులకు ప్రతిస్పందిస్తున్న వాట్సాప్


గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ ఫిర్యాదులకు ప్రతిస్పందించడం మరియు చర్య తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధించడానికి వాట్సాప్ వివిధ నిబంధనలను అమలు చేస్తుంది. హాని సంభవించిన తర్వాత ఏ ఎకౌంట్ ద్వారా హాని జరిగిందనేది గుర్తించడం కంటే ముందే హానికరమైన కార్యకలాపాలు జరగకుండా ఆపడం చాలా మంచిదని వాట్సాప్ విశ్వసిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

 మార్గదర్శకాలు పాటించకపోతే అకౌంట్స్ బ్యాన్.. వాట్సాప్ హెచ్చరిక

మార్గదర్శకాలు పాటించకపోతే అకౌంట్స్ బ్యాన్.. వాట్సాప్ హెచ్చరిక

తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, ధ్రువీకరించిన సందేశాలను ఫార్వర్డ్ చేసే వినియోగదారుల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. ఎవరైనా వాట్సాప్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించకపోతే వారి అకౌంట్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
In June, WhatsApp banned over 22 lakh bad accounts in India. If the guidelines are not followed, the accounts will be banned
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X