Whatsapp Outage Over : వాట్సాప్ రిటర్న్స్- గంటన్నర తర్వాత-సైబర్ దాడిపై వివరణ కోరిన కేంద్రం
భారత్ లో వాట్సాప్ సేవలు తిరిగి అందుబాటులోకి వచ్చాయి. ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నిలిచిపోయిన వాట్సాప్ సేవల్ని పునరుద్దరించారు. సాంకేతిక కారణాలతో వాట్సాప్ సేవలు భారత్ లో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్రం వాట్సాప్ మాతృసంస్ధ మెటా ఇండియా వివరణ కోరింది.
వాట్సాప్ సేవలు మధ్యాహ్నం ఒక్కసారిగా నిలిచిపోవడంతో యూజర్లు గందరగోళానికి గురయ్యారు. సాధారణంగా వాట్సాప్ సేవలు నిలిచినా నిమిషాల వ్యవధిలో పునరుద్ధరించేవారు. కానీ ఇవాళ దాదాపు గంటన్నరసేపు నిలిచిపోవడం, వాట్సాప్ మాతృసంస్ధ మెటా నుంచి కానీ, అధినేత మార్క్ జుకర్ బర్గ్ నుంచి కానీ ఎలాంటి వివరణ లేకపోవడంతో సైబర్ దాడి జరిగిందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సైబర్ దాడి కారణంగానే భారత్ లో వాట్సాప్ సేవలు నిలిచిపోయినట్లు జరిగిన ప్రచారంతో కేంద్రం కూడా అప్రమత్తమైంది.

వాట్సాప్ సేవలు నిలిచిపోయిన ఘటనపై కేంద్రం మెటా ఇండియా వివరణ కోరింది. భారత్ లో వాట్సాప్ పై సైబర్ దాడి జరిగిందా అన్న కోణంలో కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇంతసేపు వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలను వివరించాలని మెటా ఇండియాను కోరింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పిస్తామని మెటా ఇండియా బదులిచ్చింది. దీంతో ఈ ఘటన వెనుక సాంకేతిక కారణాలు ఉన్నాయా లేక ఇతరత్రా సమస్యలు ఉన్నాయా అన్న విషయం తెలుసుకున్నాక వివరణ ఇచ్చేందుకు మెటా ఇండియా సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications