యూజర్లకు వాట్సాప్ షాక్.. 37లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసి వినియోగదారులకు వార్నింగ్!!

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం అయిన మెసేజింగ్ సేవ సంస్థ, వాట్సాప్ నవంబర్ నెలలో చాలా మంది భారతీయులకు షాకిచ్చింది. దాదాపు నవంబర్ నెలలో ఏకంగా 37.16 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది.

నవంబరు నెలలో అత్యధికంగా 37 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

నవంబరు నెలలో అత్యధికంగా 37 లక్షలకు పైగా ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్

వాట్సాప్ ప్రతి నెల కొత్త ఐటీ నిబంధనల మేరకు నివేదికలను విడుదల చేస్తోంది. ఇక తాజాగా విడుదల చేసిన నవంబర్ నెల నివేదికలో యాప్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని అందుకు దాదాపు 37 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ బ్యాన్చేసినట్టు ప్రకటించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలలోని రూల్ 4(1)(డి) ప్రకారం ఖాతాలు నిషేధించబడ్డాయని వాట్సాప్ పేర్కొంది. భారతదేశంలోని వినియోగదారులు వాట్సాప్ యొక్క ఫిర్యాదుల మెకానిజమ్‌ల ద్వారా మరియు భారతదేశ చట్టాలను లేదా వాట్సాప్ సేవా నిబంధనలను ఉల్లంఘించినందుకుచర్యలు తీసుకున్నట్టు కంపెనీ ప్రకటనలో తెలిపింది.

ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకూ నవంబర్ నెలలోనే అధికంగా ఖాతాలు బ్యాన్

ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకూ నవంబర్ నెలలోనే అధికంగా ఖాతాలు బ్యాన్

ఏప్రిల్ నెలలో వాట్సాప్ 16 లక్షల ఖాతాలు, మే నెలలో వాట్సాప్ 19 లక్షల ఖాతాలు, జూన్ నెలలో 22 లక్షల ఖాతాలు, జూలై నెలలో 23 లక్షల ఖాతాలు, ఆగస్టు నెలలో 23 లక్షలకు పైగా ఖాతాలు, సెప్టెంబరు నెలలో 26.85 లక్షల ఖాతాలు, అక్టోబరు నెల 23.24 లక్షల ఖాతాలు బ్యాన్ చేసింది. ఇప్పుడు నవంబర్ నెలలో ఏకంగా 37 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేసినట్టు వెల్లడించింది. ఏప్రిల్ నెల నుండి ఇప్పటి వరకూ నవంబర్ నెలలోనే అధికంగా ఖాతాలు బ్యాన్ చేసినట్టు తాజా లెక్కలను బట్టి తెలుస్తుంది

వాట్సాప్ నెలవారీ నివేదిక.. రూల్స్ అతిక్రమిస్తే బ్యాన్ చేసుడే

వాట్సాప్ నెలవారీ నివేదిక.. రూల్స్ అతిక్రమిస్తే బ్యాన్ చేసుడే

నివేదిక ప్రకారం,వాట్సాప్ ప్లాట్‌ఫారమ్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ప్రతి నెల నిబంధనల మేరకు ఖాతాల పై నిఘా పెట్టిన వాట్సాప్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తి మార్గదర్శకాలు మరియు డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) రూల్స్, 2021లోని రూల్ 4(1)(డి)కి అనుగుణంగా వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేస్తూ నెలవారీ నివేదికను ప్రచురిస్తుంది. నివేదికలో వాట్సాప్ ద్వారా స్వీకరించబడిన ఫిర్యాదులకు ప్రతిస్పందనగా తీసుకున్న చర్యల సమాచారం కూడా ఉంది.

నవంబర్‌లో దేశంలో 946 ఫిర్యాదులు

నవంబర్‌లో దేశంలో 946 ఫిర్యాదులు

దేశంలో 400 మిలియన్లకు పైగా వినియోగదారులను కలిగి ఉన్న మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ అయిన వాట్సాప్ నవంబర్‌లో దేశంలో 946 ఫిర్యాదు నివేదికలను స్వీకరించింది మరియు 74 'చర్యలను' నమోదు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా 37 లక్షలకు పైగా ఖాతాలను బ్లాక్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంతో నిషేధించబడిన ఖాతాల కంటే దాదాపు 60 శాతం ఎక్కువగా వాట్సప్ ఖాతాలను బ్యాన్ చేసింది.గ్రీవెన్స్ ఛానెల్ ద్వారా యూజర్ ఫిర్యాదులకు ప్రతిస్పందించడం, చర్య తీసుకోవడంతో పాటు, ప్లాట్‌ఫారమ్‌లో హానికరమైన ప్రవర్తనను నిరోధించడానికివాట్సాప్వివిధనిబంధనలను అమలు చేస్తుంది.

మార్గదర్శకాలు పాటించకపోతే అకౌంట్స్ బ్యాన్.. వాట్సాప్ హెచ్చరిక

మార్గదర్శకాలు పాటించకపోతే అకౌంట్స్ బ్యాన్.. వాట్సాప్ హెచ్చరిక

తప్పుడు సమాచారం, నకిలీ వార్తలు, ధ్రువీకరించని సందేశాలను ఫార్వర్డ్ చేసే వినియోగదారుల ఖాతాలను వాట్సాప్ బ్యాన్ చేస్తున్నట్లుగా వెల్లడించింది. హాని సంభవించిన తర్వాతఏ ఎకౌంట్ ద్వారా హాని జరిగిందనేది గుర్తించడం కంటేముందే హానికరమైన కార్యకలాపాలు జరగకుండా ఆపడం చాలా మంచిదని వాట్సాప్ విశ్వసిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.అందుకే హానికరం అని భావిస్తున్న యాక్టివ్ ఖాతాలను సైతం బ్యాన్ చేస్తుంది.

ఎవరైనా వాట్సాప్ నిబంధనలు, మార్గదర్శకాలు పాటించకపోతే వారి అకౌంట్స్ కూడా బ్యాన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే వాట్సాప్ వినియోగదారులు తప్పనిసరిగా వాట్సాప్ ను ఎలా ఉపయోగించుకోవాలో, నియమ, నిబంధనలు ఏమిటో ఓ లుక్కెయ్యండి. లేదంటే మీ అకౌంట్ కూడా ప్రమాదంలో పడే అవకాశం లేకపోలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+