ఈ ఎరుపు చాలా ఇంకా కావాలా? అభిమానుల రక్తంతో ఎర్రబడిన బెంగళూరు
అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా, స్వర్ణోత్సవాలు చేద్దామా..? అంటూ సింధూరం సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు రాసిన పాట బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటకు సరిగ్గా సరిపోతుంది అనిపిస్తుంది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుపుకుంటూ, ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నామని సంబరపడాలా? లేదా దేశ యువత రీ రిలీజ్లు, బెనిఫిట్ షోలు, ఐపీఎల్ ట్రోఫీలు, బిగ్ బాస్ కోసం సోషల్ మీడియాలో వార్ లు చేసుకుంటున్నారని భాదపడాలో అర్ధం కావటం లేదు.
తమ 18 ఏళ్ల కలను సాకారం చేసుకోవడానికి 11 మంది ప్లేయర్లు సమిష్టిగా రాణించి, ఒక ఐపీఎల్ కప్ కొట్టి తమ స్వప్నాన్ని సాకారం చేసుకున్నందుకు చేసుకుంటున్న విజయోత్సవ సంబరాలు 24 గంటలు తిరగకుండా విషాద ఛాయలు మిగిల్చాయి. 18 ఏళ్ల కల నెరవేరిన వేళ 11 మంది జీవితాల్లో మృత్యు ఘటింకలు మోగాయి. ఐపీఎల్ చరిత్రలో ఆర్బీబీ జట్టుకు మరో 18 ఏళ్లు పాటు గుర్తుండిపోయే చీకటి రోజుగా ఈ విజయోత్సవ మృత్యు హేళికలు నిలిచిపోతాయి.

నిజంగా ఏందుకింత మిడిసిపాటు? ఒక టీం ఐపీఎల్ కప్ కొడితే ఇంత హాడావుడి చేయాలా? సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ స్టార్లు ఇచ్చిన పిలుపు "కాన్సర్ ఎరుపెక్కాల, ఎర్రసముద్రం కనబడాల" ఇలాంటి కొటేషన్లతో అభిమానులను రెచ్చగొట్టి, స్డేడియంకి రప్పించి 11 మంది ప్రాణాలు తీసుకున్న పాపం ఎవరిది? వారి కుటుంబాల్లో జరిగిన నష్టాన్ని ఎవరు పూడ్చగలరు? ఐపీఎల్ ఒక వ్యాపారం. కోట్లు పెట్టి ప్లేయర్లను కొని, కోట్ల మంది చూసేలా చేసి.. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబడి తీసుకొచ్చే ఒక వ్యాపారం. ఇప్పటికే బెట్టింగ్ రూపంలో ఎందరో జీవితాలు రోడ్డున పడుతున్నాయి, మరెందరో ప్రాణాలు బలి తీసుకుంటున్నాయి. ఊహ తెలియని వయసులోనే చిన్న పిల్లలపై సైతం ఈ ఐపీఎల్ ప్రభావాన్ని చూపిస్తుందంటే ఎంతలా ఈ వ్యాపారానికి మనం బానిసలమయ్యామో అర్ధం చేసుకోవచ్చు. దీంతో పాటు మన పెంపకం ఎలా ఉందో ఉహించుకోవచ్చు.
ఈ విజయోత్సవం ఖరీదు 11 మంది ప్రాణాలు..
ఒక రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంతో, ఈ దేశంతో సంబందం లేని కొంత మంది ప్లేయర్లను ఆ రాష్ట్ర ప్రభుత్వ సచివాలయానికి పిలిచి, అధికారికంగా సీఎం చేతుల మీదుగా సన్మానం చేయించాల్సినంత అవసరం నిజంగా ఉందా? ఈ క్రమంలోనే పురుషుల ఐపీఎల్ కు ఉన్న ఆదరణ, మహిళల ఐపీఎల్ కు ఎందుకు లేదు? ఐపీఎల్ కప్ కొడితే ఏదో ప్రపంచ కప్ కొట్టినట్లు సంబరాలు చేశారే.. చివరకు ఏం మిగిలింది.. 11 మంది కుటుంబాలను రోడ్డున పడేసింది. మరెందరో జీవితాల్లో మాయని మచ్చగా ఈ ఏడాది జరిగిన టోర్నీ నిలిచిపోయింది.

ఈ ఎరుపు చాలా ఇంకా కావాలా?
బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ ఫ్యాన్స్ అత్యుత్సాహం కారణంగా జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు, మీమ్ పేజీలు బలిగొన్న ప్రాణాలు ఇవి. లేని హైప్ ను జనాలకు అంటగట్టడం, జనాలు గుడ్డి గొర్రెలుగా ప్రవర్తించేలా ప్రభావితం చేయడం, కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్లు ట్రెండ్స్ ఫాలో కావాలి. వాళ్ల వ్యూస్ ఏ వాళ్లకి బిజినెస్. అది చూసి మనలాంటి సామాన్యులకి అనిపిస్తుంది "ఇదే జీవితం" ఏమో అని. ఇక్కడే కమర్షియల్ ఫార్మెట్ గేమ్ కూడా ఎమోషన్ గా మారింది. ఇక్కడే రీ రిలీజ్ ట్రెండ్ మొదలైంది. ఇక్కడే బెనిఫిట్ షోలకు క్రేజ్ పెరిగింది. జనాలకు అక్కడికి వెళ్లి ఆ ప్రాంతాన్ని ఆస్వాదించడం కంటే అక్కడికి వెళ్లి ఏంజాయ్ చేసినట్లు రీల్స్, స్టోరీలు క్రియేట్ చేయడం పరిపాటిగా మారింది. వాట్సాప్ స్టేటస్ లు, ఇన్ స్టా స్టోరీలకు ఇక్కడే ఇంపార్టెన్స్ పెరిగింది. ఎగబడి ఎగబడి వీడియోలు తీసే నీ అత్యుత్సాహానికి, నువ్వు ఇష్టపడే సెలబ్రిటీ కూడా తన ఆనందాన్ని కొల్పోతున్నారు.
ఎమోషన్ టూ పరాకాష్ట
ఆర్సీబీ అంటే నిజంగా ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ ఐపీఎల్ టైటిల్ కైవశం చేసుకున్న తర్వాత పిచ్చిగా మారింది. ఈ పిచ్చి ఆర్సీబీ టీం బెంగళూరులో అడుగు పెట్టగానే పరాకాష్టకు చేరింది. దాని ఫలితమే చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట. ఈ సీజన్ లో మ్యాచ్ లు జరిగిన వేదికల్లో చిన్నస్వామి స్టేడియం కూడా ఒకటి. దశాబ్దాలుగా జాతీయ, అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచింది. ఎన్నో కీలక ఘట్టాలను చూసిన ఈ స్టేడియం.. ఈ రోజును తన చరిత్రలో ఒక చీకటి రోజుగా లిఖించుకుంది. ఒక మ్యాచ్ నిర్వహణకు ఎంతో పటిష్టమైన భద్రత, వచ్చిన అభిమానుల క్షేమంగా ఇంటికి వెళ్లేలా ప్లానింగ్ ఉంటుంది. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో పాటు, అభిమానుల సహకారం కూడా చాలా ముఖ్యం. అవి గతి తప్పితే జరిగేది ఆట కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటం.

చివరిగా ఒక మాట..
మీ కుటుంబానికి మీరు ముఖ్యం. మీరు మీ కుటుంబానికి, మీతో పాటు ఉండే వారికి, ఈ సమాజానికి చేయగలిగేది ఏదైనా ఉంది అంటే.. "మీరు ఇబ్బంది పడకుండా, తోటి వారిని ఇబ్బంది పెట్టకుండా బతకడమే". అప్పుడే సమాజం బాగుపడుతుంది. రీ రిలీజ్ కు వెళ్లకపోతే బ్రతుకేం తలకిందులు కాదు.. బెనిఫిట్ షో చూడకపోతే సమాజం నిన్ను తక్కువ చేసి చూడదు. కోహ్లీకి నువ్వు స్వాగతం పలకకపోతే నువ్వేం దేశ ద్రోహివి కావు. అరుణాచల గిరి ప్రదక్షణ చేయకపోతే నువ్వేం హిందూ కాకుండా పోవు.. కరుంగళి మాల ధరించకపోతే నీ బతుకేం మారిపోదు. ఇవ్వన్ని నువ్వు రీయలైజ్ అయిన నాడు.. నువ్వూ, నీతో పాటు ఉండే సమాజం బాగుపడకపోయినా... కనీసం నీ కోసం, నీ కుటుంబం కోసం బ్రతికి ఉంటావ్. నలుగురిని బతికిస్తావ్. మనిషిలా బతుకు, మంచి చేయడానికి బతుకు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications