Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నాటి షాక్: క్యాస్ట్రోతో ఇందిర ఆలింగనం, మంచి స్నేహితుడిక లేడన్న మోడీ

క‌్యూబా విప్ల‌వ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మనదేశంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఒకసారి భారత్ సందర్శించారు క్యాస్ట్రో.

న్యూఢిల్లీ/హైదరాబాద్: క‌్యూబా విప్ల‌వ నేత ఫిడెల్ క్యాస్ట్రోకు మనదేశంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే ఒకసారి భారత్ సందర్శించారు క్యాస్ట్రో. అంతేగాక, నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీని క్యాస్ట్రో త‌న సోద‌రిగా భావించేవారు. 1983లో న్యూఢిల్లీలో జ‌రిగిన ఏడో అలీనోద్య‌మ స‌మావేశానికి క్యాస్ట్రో వ‌చ్చారు. ఆ స‌మావేశాల సంద‌ర్భంగా ఇందిర‌ను క్యాస్ట్రో ఆత్మీయ ఆలింగ‌నం చేసుకోవ‌డం ప్ర‌పంచాన్నే ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది.

ఈ స‌మావేశాల‌కు రికార్డు స్థాయిలో వంద దేశాల‌కు పైగా ప్ర‌తినిధులు హాజ‌ర‌య్యారు. అంత‌కుముందు 1979లో ఈ స‌మావేశాల‌కు ఆతిథ్య‌మిచ్చిన క్యూబా దేశాధ్య‌క్షుడు ఈ స‌మావేశాల్లో ఆ బాధ్య‌త‌లు భార‌త్‌కు అప్ప‌గించారు. త‌న సోద‌రి ఇందిరా గాంధీకి స‌మావేశాల బ్యాటన్‌ను అందించ‌డం త‌న‌కు చాలా సంతోషంగా, గ‌ర్వంగా ఉంద‌ని క్యాస్ట్రో ప్ర‌క‌ట‌న చేశారు.

When Fidel Castro embraced Indira Gandhi in a huge bear hug

ఆ త‌ర్వాత ఆ బ్యాట‌న్ అందుకోవ‌డానికి ఇందిరాగాంధీ.. క్యాస్ట్రో ద‌గ్గ‌రికి వ‌చ్చారు. రెండుసార్లు ఆమె చేయి చాచినా.. క్యాస్ట్రో మాత్రం బ్యాట‌న్ ఇవ్వ‌కుండా న‌వ్వుతూ చూస్తుండిపోయారు. ఆ త‌ర్వాత మూడోసారి బ్యాట‌న్ ఇవ్వ‌కుండా ఇందిర‌ను ద‌గ్గ‌ర‌కు తీసుకొని ఆత్మీయ ఆలింగ‌నం చేసుకోవ‌డంతో ఆమె ఆశ్చర్య‌పోయారు. ఈ ఘ‌ట‌న‌తో స‌మావేశ మందిరం చ‌ప్ప‌ట్ల‌తో మారుమోగిపోయింది. అప్పట్లో ఈ ఘటన ప్రపంచంలో సంచలనంగా మారింది.

మంచి స్నేహితుడ్ని కోల్పోయాం: మోడీ

విప్లవయోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. క్యూబా ప్రజలకు, ప్రభుత్వానికి తన సానుభూతిని ప్రకటించారు. ఈ విషాద సమయంలో క్యూబా ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందన్నారు. పిడెల్ కాస్ట్రో 20వ శతాబ్దపు వీరుడని పొగిడారు. ఆయన మృతితో భారత్ ఒక మంచి స్నేహితున్ని కోల్పోయిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+