లోకసభలో మోడీకి 'జై శ్రీరాం'తో స్వాగతం, బిజూ జనతాదళ్ ఎంపీ కూడా..

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు మలి విడత జరుగుతున్నాయి. అందులో భాగంగా బుధవారం సభ సమావేశం అయినప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ సభలోకి అడుగు పెడుతుండగా ఒక్కసారిగా బీజేపీ సభ్యులు జై శ్రీరాం, మోడీ.. మోడీ అంటూ స్వాగతం పలికారు.

సాధారణంగా ప్రధాని, ఇతర సీనియర్ నాయకులు ఎవరైనా సభలోకి వస్తున్నప్పుడు గౌరవ సూచకంగా లేచి నిలబడటం, నమస్కారం పెట్టడం లాంటివి కనిపిస్తాయి. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రెండు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించి, మరో రెండు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేసిన సందర్భంగా.. మోడీని అభినందించేందుకు బీజేపీ ఎంపీలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు.

When Jai Shri Ram slogans greeted PM Narendra Modi in Lok Sabha

సమావేశాల ప్రారంభం అయిన కొద్దిసేపటికి ప్రధాని మోడీ సభలోకి అడుగు పెట్టారు. మోడీని చూడగానే బీజేపీ పార్లమెంట్‌ సభ్యులు నిలబడి బల్లలు చరిచారు.

కొందరు బీజేపీ ఎంపీలు భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. బీజేపీ ఎంపీలతో పాటు బిజు జనతాదళ్‌కు చెందిన వైజయంత్‌ పాండా కూడా బల్లను చరుస్తూ.. మోజీరి స్వాగతం పలికారు. 10 నిమిషాల తర్వాత ప్రధాని లోకసభ నుంచి వెళ్లిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Prime Minister Narendra Modi was given a grand welcome by BJP members in the Lok Sabha on Wednesday amid slogans of "Jai Shri Ram" and "Modi Modi".
Please Wait while comments are loading...