వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తొలి చూపులోనే సోనియాతో ప్రేమలో, వెరైటీగా లవ్ ప్రపోజ్ చేసిన రాజీవ్

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మాజీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని రాజీవ్ గాంధీ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయారట. సోనియాగాంధీకి వేరైటీగా రాజీవ్ గాంధీ తన లవ్ ప్రపోజల్‌ను వెరైటీగా సోనియాగాంధీ వద్ద రాజీవ్ వ్యక్తం చేశారని ఆ కుటుంబ సన్నిహితులు చెబుతుంటారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించిన సోనియాగాంధీ రెండు రోజుల క్రితం ఆ బాధ్యతల నుండి తప్పుకొన్నారు. సోనియాగాంధీ స్థానంలో రాహుల్ గాంధీ ఈ బాధ్యతలను చేపట్టారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతనోత్తేజం నిండిందని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు

 తొలి చూపులోనే సోనియాతో ప్రేమలో పడ్డ రాజీవ్ గాంధీ

తొలి చూపులోనే సోనియాతో ప్రేమలో పడ్డ రాజీవ్ గాంధీ

ఇటలీలో రాజీవ్ గాంధీ చదువుకొనే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఈ రెండు కుటుంబాలకు సన్నిహితులుగా ఉన్నవారు చెబుతుంటారు.తొలి చూపులోనే రాజీవ్‌గాంధీ సోనియాతో ప్రేమలో పడ్డారట.ఈ ప్రేమను కూడ సోనియాకు రాజీవ్ గాంధీ చెప్పారంటారు. మొత్తానికి ఈ ప్రేమ సఫలమైంది. తనకు నచ్చిన సోనియాగాంధీని రాజీవ్ గాంధీ వివాహం చేసుకొన్నారు.

 వెరైటీగా సోనియాకు లవ్ ప్రపోజ్ చేసిన రాజీవ్ గాంధీ

వెరైటీగా సోనియాకు లవ్ ప్రపోజ్ చేసిన రాజీవ్ గాంధీ

సోనియాగాంధీకి రాజీవ్ గాంధీ వెరైటీగా లవ్ ప్రపోజ్ చేశారని ఆ కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నవారు చెబుతుంటారు.రాజీవ్‌గాంధీ కేంబ్రిడ్జి యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆయన గ్రీక్ రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడ రాజీవ్.. సోనియాను తొలిసారిగా చూశారు.. కేంబ్రిడ్జి యూనివర్శిటీ‌కి చెందిన గ్రీక్ రెస్టారెంట్ ఓనర్ చార్లస్ ఆంటోనీతో రాజీవ్ గాంధీ.. తాను ఆ ఇటాలియన్ యువతి పక్కన కూర్చోవాలనుకుంటున్నానని చెప్పారు.. ఈ మాటవినగానే కంగారు పడిన ఆంటోనీ ఇందుకోసం అధికంగా డబ్బు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. అందుకు రాజీవ్ గాంధీ ఒప్పుకొన్నారని చెబుతారు.

 సోనియాగాంధీపై కవిత రాసిన రాజీవ్

సోనియాగాంధీపై కవిత రాసిన రాజీవ్

సోనియాను చూడగానే ప్రేమలో పడిన రాజీవ్‌గాంధీ వెంటనే ఆమెపై కవిత రాశారని ఆ కుటుంబ సన్నిహిత వర్గాల్లో ప్రచారంలో ఉంది.రాజీవ్ గాంధీ నేపికిన్‌పై సోనియాపై ఒక కవిత రాశారు. దానితో పాటు ఒక షాంపేన్ బాటిల్‌ను సోనియాకు అందజేయమని అతనిని కోరారని చెబుతారు.సోనియాతో రాజీవ్ తన ప్రేమ విషయాన్ని వెల్లడించారని చెబుతారు.

 సోనియా అందగత్తె

సోనియా అందగత్తె

తాను చూసిన మహిళలందరిలోకీ అందగత్తె అని రాజీవ్ గాంధీ సోనియాకు కితాబిచ్చారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో రాజీవ్‌గాంధీ చెప్పారని అంటారు.సోనియాను చూడగానే ఈమె నాకోసమే పుట్టిందని అనుకున్నానని ఆ ఇంటర్వ్యూలో చెప్పారని సమాచారం.

 రాజీవ్‌తో వివాహనికి ఒప్పుకోని సోనియా తండ్రి

రాజీవ్‌తో వివాహనికి ఒప్పుకోని సోనియా తండ్రి

రాజీవ్‌గాంధీతో సోనియా వివాహన్ని సోనియా తండ్రి స్టిఫెన్ మైనో ఒప్పుకోలేదని సమాచారం. రాజీవ్ తల్లి ఆ సమయంలో ఇండియాకు ప్రధానమంత్రిగా ఉన్నారు. రాజీవ్ తల్లి ప్రధానమంత్రిగా ఉన్న కారణంగానే స్టీఫెన్ మైనో ఈ వివాహనికి ఒప్పుకోలేదంటారు. అయితే ఎట్టకేలకు రాజీవ్ మాత్రం సోనియాగాంధీని వివాహం చేసుకొన్నారు.

English summary
When Rajiv Gandhi proposed Sonia in a 'special way' in a restaurant.In 1964,Rajiv saw Sonia for the first time in a restaurant and after seeing her, he wrote a poetry on a piece of napkin and asked the manager to give this poetry in a bottle of champagne to Sonia. Both of them got married in 1968,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X