డెడ్‌లైన్: శశికళకు ముందే చెప్పిన జ్యోతిష్కుడు, నాడు జయకూ..

అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవిష్యత్తును ఆమె జ్యోతిష్కుడు ముందే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె దురదృష్టమో.. మరొకటో కానీ ఆమె ముఖ్యమంత్రి ఆశలు దాదాపు కలలు కల్లలు అయ్యాయనే చెప్పవచ్చు.

చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి శశికళ భవిష్యత్తును ఆమె జ్యోతిష్కుడు ముందే చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె దురదృష్టమో.. మరొకటో కానీ ఆమె ముఖ్యమంత్రి ఆశలు దాదాపు కలలు కల్లలు అయ్యాయనే చెప్పవచ్చు.

రివ్యూ పిటిషన్ కోరితే ఆమె ఏ మేరకు విజయం సాధిస్తారనేది అనుమానమే. నేటి సుప్రీం కోర్టు తీర్పు ద్వారా.. ఆమె పదేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది.

గత వారం జ్యోతిష్కుడు శశికళకు ఓ సూచన చేశారని తెలుస్తోంది. ఫిబ్రవరి 14వ తేదీ లోపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పారని తెలుస్తోంది. ఆమె కనుక ఈ లోగా ముఖ్యమంత్రి పదవి చేపట్టకుంటే ఇక జీవితంలో ఆ పోస్టును పొందలేరని చెప్పారని తెలుస్తోంది.

When Sasikala's asgtrologer predicted her fate spot on

జ్యోతిష్కుడు చెప్పిన ఆ గడువు నాడే సుప్రీం కోర్టు అక్రమాస్తుల కేసులో తీర్పు రావడం గమనార్హం. ఈ తీర్పు నేపథ్యంలో ఆమె సమీప భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయారు.

మొత్తంగా ఆమె జైలు శిక్ష అనుభవించే నాలుగేళ్లకు తోడుగా, మరో ఆరేళ్ల పాటు పోటీకి అనర్హురాలు.

శశికళకు జ్యోతిష్కుల పైన విశ్వాసం. ఆశక్తికర విషయమేమంటే జయలలిత కూడా నమ్మేవారు.

2001లో జయలలిత ఓ కేరళ జ్యోతిష్కుడిని ఆశ్రయించారు. అఫ్పుడు ఆమె ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలిగా ఉన్నారు.

భవిష్యత్తులో మీరు ముఖ్యమంత్రి అవుతారని జయలలితకు సదరు కేరళ జ్యోతిష్కుడు చెప్పారు. సదరు జ్యోతిష్కుడి మాటలు నిజమయ్యాయి. ఆ తర్వాత ఆమె సీఎం అయ్యారు. జయ సంతోషంతో ఆయనకు పార్టీ తరఫున రూ.10 లక్షలు ఇచ్చారు. ఆ జ్యోతిష్కుడి పేరు పీయు పణిక్కర్. అతని జోస్యం పట్ల జయలలితకు విశ్వాసం ఎక్కువ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+