వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ట్రాక్‌పై ఎదురెదురుగా రెండు మోనో రైళ్లు: ఏం జరిగిందంటే..

మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు మోనో రైళ్లు ఒకే ట్రాక్ పైన ఎదురెదురుగా వచ్చాయి. దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

|
Google Oneindia TeluguNews

ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రెండు మోనో రైళ్లు ఒకే ట్రాక్ పైన ఎదురెదురుగా వచ్చాయి. దగ్గరగా వచ్చి ఆగిపోయాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది.

భారీ ప్రమాదం తప్పిందంటూ ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్లు అవుతున్నాయి. డైవర్ల అప్రమత్తతో ప్రమాదం తప్పిందని చెబుతున్నారు.

అయితే, ఆ రెండు రైళ్లు ఎందుకు ఎదురెదురుగా వచ్చాయనే విషయం తెలియరాలేదు. రెండు రైళ్లు కూడా వ్యతిరేక మార్గంలో నడుస్తున్నాయి. అలాంటప్పుడు ఒకే ట్రాక్ పైన ఎందుకు వచ్చాయో తెలియరాలేదు.

సోషల్ మీడియాలో ఇది వైరల్ అయింది. దీనిపై ముంబై మోనో రైల్‌ అధికారులు వివరణ ఇచ్చారు. రైళ్లు ఒకదానికొకటి ఎదురుగా రాలేదని చెప్పారు. సాంకేతికలోపం కారణంగా ఓ రైలు ట్రాక్‌పై నిలిచిపోయిందని, అందులో ఉన్న ప్రయాణికులను అక్కడి నుంచి తరలించేందుకు మరో రైలు అక్కడికి వెళ్లిందని వివరణ ఇచ్చారు.

చెంబూరు ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాలో తలెత్తిన సమస్యతో మోనో రైలు చాలా సేపటివరకు నిలిచిపోయిందని, అయితే స్టేషన్‌కు సమీపంలోనే ఆగిపోవడంతో ప్రయాణికులను సురక్షితంగా రైలు నుంచి దించేందుకు సహాయక చర్యలు చేపట్టామని, ఆ సమయంలో అదే ట్రాక్ పైకి సహాయకచర్యలు చేపట్టేందుకు మరోరైలు దానికి దగ్గరగా వచ్చి నిలిచిందని తెలిపారు.

English summary
Two trains on the Mumbai monorail came face to face on Saturday evening, sending social media users into a tizzy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X