వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎంతిచ్చారు?: కరోనా వ్యాక్సిన్ ధరల విధానంపై తెలపాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సిన్ ధరల వ్యత్యాసంపై మరోసారి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. కరోనా వ్యాక్సిన ధరల విధానాన్ని పునర్ సమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వ్యాక్సిన్ ధరల విధానం ప్రజల ఆరోగ్య హక్కుకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది.

కేంద్రానికి తక్కువ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధర వర్తించేలా టీకా తయారీదారులు రెండు వేర్వేరు ధరలు సూచించారని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఎల్ నాగేశ్వరరావు, ఎస్ రవీంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

 Whether Centres COVID Vaccine Procurement Prices Account For Aid Given To SII, Bharat Biotech?: Supreme Court

రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్తోమత ఆధారంగా టీకా ఉచితంగా అందుబాటులో ఉండాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలా ఆధారపడితే అది దేశ వ్యాప్తంగా అసమానతలు సృష్టిస్తుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పౌరులకు
అందించే టీకాలు విలువైన ప్రజాప్రయోజనాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించింది.

బలహీనవర్గాలు, అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు వ్యాక్సిన్ కొనుగోలు చేసే సామర్థ్యం లేకపోవచ్చని పేర్కొంది. 18-44 ఏళ్ల వయస్కులకు వ్యాక్సిన్ అందించేందుకు టీకా తయారీదారులతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపవచ్చని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఇక భారత్ బయోటెక్ కోవాగ్జిన్, సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ టీకాల కోసం ఎంత ఖర్చు చేశారని ప్రశ్నించింది. వివరాలు సమర్పించాలని ఆదేశించింది.

Recommended Video

Cricket Australia Donates USD 50,000 To India | Oneindia Telugu

ఇది ఇలావుండగా, దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇక తాజాగా కరోనాకేసులు కాస్త నెమ్మదించి గత 24 గంటల్లో 3.68 లక్షల కరోనా కేసులు నమోదైనట్లుగా తెలుస్తుంది. నిన్నఒక్కరోజు భారతదేశంలో 3,417 మంది మరణించారు.
నిన్న ఒక్కరోజు నమోదైన కరోనా కేసులు 3,68,147.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1.99 కోట్లకు చేరింది. ఇక గడచిన 24 గంటల్లో 3,00,732 మంది కరోనా జయించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు 1.62 కోట్ల మంది కరోనా నుండి కోలుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రికవరీ రేటు 81.77 శాతంగా ఉంది.

English summary
The Supreme Court has sought from the Central Government the details of public funding and aid given to COVID vaccine manufacturers Bharat Biotech and Serum Institute of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X