ప్రాణం తీసిన టూర్, లేడీ టెక్కీతో సహా స్పాట్ లో ముగ్గురు, కారు టైర్ పేలింది !
బెంగళూరు/మైసూరు: ఐటీ, బీటీ కంపెనీలతో పాటు కార్పోరేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తున్న యువతి, యువకులతో పాటు కుటంబాలతో కలిసి వీకెండ్ లో విహారయాత్రలకు వెలుతుంటారు. బెంగళూరులో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం వీకెండ్ లో విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రకు ముగించుకుని ఐటీ హబ్ కు వస్తున్న సమయంలో కారు టైర్ పేలిపోయి ముగ్గురు చనిపోయారు.
వేగంగా వెలుతున్న కారు టైరు పేలి ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బెంగళూరు ఉత్తర తాలూకాలోని అంచేపాళ్య సమీపంలో చోటుచేసుకుంది. అగస్టీన్, దాదారెడ్డి అలియాస్ రెడ్డి, నిరోష్ అనే ముగ్గురు దురదృష్టవశాత్తు మృతి చెందినట్లు గుర్తించామని బెంగళూరు ఉత్తర తాలుకా పోలీసులు తెలిపారు.

మృతులు ముగ్గురు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అని, బెంగళూరు నగరంలోని మాన్యతా టెక్ పార్క్ సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో వీరు పనిచేస్తున్నట్లు సమాచారం అందిందని పోలీసు అధికారులు తెలిపారు. ఐదుగురు స్నేహితులు మైసూరు తదితర ప్రాంతాలకు పర్యటనకు వెళ్లారు. విహారయాత్ర ముగించుకుని బెంగళూరుకు తిరిగి బయలుదేరారని పోలీసులు అన్నారు.
బెంగళూరుకు వస్తున్న సమయంలో అంచేపాళ్య సమీపంలో కారు టైరు పేలి వేగంగా వెలుతున్న కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారని, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని బెంగళూరు పోలీసు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని బెంగళూరులోని దాసరహళ్లిలో నివాసం ఉంటున్న మిథున్ యాదవ్ (27), నాగవారకు చెందిన శతృఘ్న (30)గా గుర్తించామని పోలీసులు అన్నారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. నెలమంగళ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications