వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైట్ ఫంగస్ సాధారణ ఇన్ఫెక్షన్.... కానీ, బ్లాక్ ఫంగస్ ప్రమాదకరం: వైద్యుల వెల్లడి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్‌లో విజృంభిస్తున్న తరుణంలో బ్లాక్ ఫంగస్ ముప్పు రోజు రోజుకు మరింతగా పెరుగుతోంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారినపడి పదుల సంఖ్యలో మరణించారు. అయితే, ఇప్పుడు దేశంలో కొత్తగా వైట్ ఫంగస్ వెలుగు చూడటం కలకలం రేపుతోంది.

ప్రస్తుతం బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో వైట్ ఫంగస్ కేసులు వెలుగు చూశాయి. బీహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. యూపీలో ఒకరికి వైట్ ఫంగస్ సోకినట్లు తేలింది. అయితే, ఈ వైట్ ఫంగస్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, ఇది సాధారణ ఫంగల్ ఇన్ఫెక్షన్ అని వైద్యులు స్పష్టం చేశారు.

 White fungus just a normal fungal infection, black fungus more dangerous: Doctors

వైట్ ఫంగస్ కంటే బ్లాక్ ఫంగస్ చాలా ప్రమాదకరమని వెల్లడించారు. కాన్డిడియాసిస్ ఇన్ఫెక్షన్ సర్వసాధారణమైన ఓరల్ థ్రష్ అని వైద్యులు తెలిపారు. వైట్ ఫంగస్ గురించి ఆందోళన చెందవద్దని, ఇది కాన్డిడియాసిస్, కాండిడా అనే రకమైన ఫంగస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ అని అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఈశ్వర్ గిలాడా తెలిపారు.

వైట్ ఫంగస్ ప్రమాదకరమని నిరూపించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్లకు, కరోనా చికిత్సలో స్టెరాయిడ్స్ అధికంగా తీసుకున్నా వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ వస్తుందని తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా గోళ్లు, చర్మం, పొట్ట, కిడ్నీలు, మెదడు, ప్రైవేటు భాగాలు, నోరు భాగాలపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని వెల్లడించారు.

కాగా, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ముకోర్మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అనేది ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కలిగే సమస్య. పర్యావరణంలోని శిలీంధ్ర బీజాంశాలతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ప్రజలు మ్యూకోమైకోసిస్‌ బారినపడుతున్నారు. కట్, స్క్రాప్, బర్న్ లేదా ఇతర రకాల చర్మ గాయం ద్వారా ఫంగస్ చర్మంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఇది చర్మంపై అభివృద్ధి చెందుతుంది. కోవిడ్ -19 నుంచి కోలుకుంటున్న లేదా కోలుకున్న రోగులలో ఈ వ్యాధి కనుగొనబడింది. అంతేగాక, డయాబెటిస్ ఉన్నవారు, రోగనిరోధక శక్తి సరిగ్గా పనిచేయని ఎవరైనా ఈ వ్యాధి పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, బ్లాక్ ఫంగస్ కారణంగా కొందరు కంటిచూపు కోల్పోవడం, ముఖ భాగంలో ఉబ్బడం లాంటి తీవ్ర పరిణామాలుంటున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారి ప్రాణాలను తీస్తోందీ ఫంగస్.

బ్లాక్ ఫంగస్ బారిన పడకుండా ఉండేందుకు రణదీప్ గులేరియా మూడు విషయాలను కీలకంగా సూచించారు. ఒకటి.. బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి. 2.. స్టెరాయిడ్స్ తీసుకుంటున్నవారు తప్పనిసరిగా బ్లడ్ షుగర్ లెవల్స్ పరీక్షించుకుంటూ ఉండాలి. 3.. స్టెరాయిడ్స్ ఇచ్చేటప్పుడు, డోసేజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

English summary
At a time when states are witnessing a rise in black fungus (mucormycosis) cases, a disease primarily affecting immunocompromised Covid-19 patients, reports of another fungal infection, called "white fungus" have caused a stir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X