బెదిరింపులు మమ్మల్నేం చేయలేవు! : సలహుద్దీన్ కు వెంకయ్య కౌంటర్
హైదరాబాద్ : భారత్ పట్ల హిజ్బూల్ ముజాహిద్దీన్ నేత సయిద్ సలహాద్దీన్ హెచ్చరికలపై తీవ్రంగా స్పందించారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. కశ్మీర్ స్వతంత్రం కోసం పాకిస్తాన్ మద్దతునిచ్చినట్లయితే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ తప్పదంటూ.. సలహాద్దీన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు.
కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడానికి అసలు సలహుద్దీన్ ఎవరు.. అని ప్రశ్నించిన వెంకయ్య, కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి లేదని స్పష్టం చేశారు. అసలు కశ్మీర్ పై మాట్లాడే హక్కు అతనికి ఎవరిచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు వెంకయ్య.

కేవలం పబ్లిసిటీ పాకులాట కోసమే సలహుద్దీన్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడని, ఇలాంటి వ్యక్తులను వెనుకేసుకు రావడం సరైందా కాదా అన్నది పాక్ తేల్చుకోవాలని సూచించారాయన. అలాగే సలహుద్దీన్ బెదిరింపులు తమను ఏమి చేయలేమని చెప్పుకొచ్చారు వెంకయ్య.












Click it and Unblock the Notifications