అమీర్ ఖాన్ ఫ్యాన్: ఎవరీ అర్వింద్ కేజ్రీవాల్?
న్యూఢిల్లీ: ఢిల్లీ శానససభ ఎన్నికల్లో రాజకీయ దిగ్గజం షీలా దీక్షిత్‌ను మట్టి కరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత జీవితం కూడా అతి సాధారణంగానే గడిచింది. కేజ్రీవాల్ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అభిమాని. సమయం దొరికినప్పుడు పిల్లలను సినిమాలకు తీసుకుని వెళ్లడం తనకు ఇష్టమనే ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
ప్రత్యర్థులందరికీ ఒక్కడే చాలు, నాన్నలో ఆ దమ్ము ఉందని కేజ్రీవాల్ 12 ఏళ్ల కుమారుడు పులకిత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తన పాఠశాల ఉపాధ్యాయులు, సీనియర్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అభిమానులని ఆయన 17 ఏళ్ల కూతురు హర్షిత చెప్పింది.

ఐఆర్ఎస్ అధికారి అయిన కేజ్రీవాల్ భార్య సునీత కుటుంబానికి వెన్నెముక. కేజ్రీవాల్ శక్తి సామర్థ్యాలు నమ్మశక్యం కాకుండా ఉంటాయని ఆయనను దగ్గరగా చూసినవాళ్లు చెబుతారు. రెవెన్యూ సర్వీసులో చేరిన రోజునే తన ప్రత్యేకతను కేజ్రీవాల్ చాటుకున్నాడు. తనకు ప్యూన్ వద్దన్నాడు.
పనిలో కేజ్రీవాల్ ఇతరుల నుంచి కూడా ఎక్కువగానే డిమాండ్ చేశ్తాడు. అయితే, వారిని భయపెట్టి అధికారం చెలాయించి కాకుండా గౌరవప్రదమైన రీతిలో వ్యవహరించి పని తీసుకుంటాడు. కేజ్రీవాల్‌కు ఆగ్రహం వచ్చిన సందర్భాలు లేవని ఆయన సహోద్యోగులు చెబుతారు. ఏదైనా పని పూర్తి చేయడానికి ముందుకు రాకపోతే తానే స్వయంగా పూనుకుని పూర్తి చేసేవాడు. కోపం వస్తే మౌనంగా తన గదిలోకి వెళ్లిపోయి, తలుపులు పెట్టుకునేవాడట.
కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16వ తేదీన హర్యానాలోని హిస్సార్‌లో జన్మించాడు. తండ్రి గోవింద్ రామ్ కేజ్రీవాల్ మిశ్రా బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్‌గా పనిచేసేవారు. తల్లి గీతాదేవి. కేజ్రీవాల్‌కు తమ్ముడు, సోదరి ఉన్నారు.
ముస్సోరీలో సివిల్ సర్వీసెస్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో తన బ్యాచ్‌మెట్ అయిన సునీతను వివాహం చేసుకున్నాడు. ఆమె ఐఆర్ఎస్ అధికారి. కేజ్రీవాల్ పూర్తిగా శాకాహారి, చాలా ఏళ్లుగా విపాసనను ఆచరిస్తున్నారు.
కేజ్రీవాల్ 1985లో ఐఐటి ఖరగ్‌పూర్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరారు. టాటా స్టీల్ సంస్థలో జంషెడ్‌పూర్‌లో చేరారు. సివిల్ సర్వీసెస్ ప్రవేశపరీక్షకు తయారు కావడానికి సెలవులు పెట్టాడు. 1999లో ఉద్యోగాన్ని వదిలేసి కోల్‌కతాలోని రామకృష్ణా మిషన్‌లో గడిపారు.
మొదటి దెబ్బకే సివిల్ సర్వీసెస్ కొట్టి, ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌లో చేరారు. ఈలోపే మదర్ థెరిస్సాను కలిశారు. ఆమెతో కలిసి పనిచేశారు. 1999 - 2000ల మధ్య కాలంలో పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. పౌరులకు వివిధ సేవల్లో సహాయం చేసే పని చేపట్టారు. మూడేళ్ల పాటు రాజీనామా చేయకుండా సెలవు మీద ఉన్నారు. ఆ తర్వాత 2003లో తిరిగి ఐఆర్ఎస్‌లో చేరారు. 18 నెలల పాటు పనిచేశారు. ఈ సమయంలో కూడా తన సామాజిక సేవను వదిలిపెట్టలేదు.
ఆర్‌టిఐ చట్టం రావడానికి దోహదం చేసినందుకు ఆయనకు 2006లో రామన్ మేగసాసే అవార్డు లభించింది. ఐఆర్ఎస్ నుంచి రాజీనామా చేశారు. అవార్డు డబ్బులను పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ అనే ఎన్జీవో ఏర్పాటుకు కార్పస్ ఫండ్‌గదా ఇచ్చారు.
అన్నా హజారే లోక్‌పాల్ బిల్లు కోసం చేపట్టిన ఆందోళన కార్యక్రమం సందర్భంగా కేజ్రీవాల్ 2011లో జాతీయ స్థాయిలో తెర మీదికి వచ్చారు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 డిసెంబర్ ఎన్నికల్లో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దిక్షీత్‌ను 25,864 ఓట్ల మెజారిటితో ఓడించారు. ఈ నెల 26వ తేదీన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టబోతున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications