Delhi CM: కౌన్ బనేగా ఢిల్లీ సీఎం?.. వీడని ఉత్కంఠ.. ఫిబ్రవరి 20న ప్రమాణ స్వీకారం!
Delhi CM: 27 ఏళ్ల తర్వాత బీజేపీ దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది. ఫిబ్రవరి 20న ఢిల్లీలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదికను నిర్ణయించనప్పటికీ.. ఆ కార్యక్రమంలో రాంలీలా మైదానంలో జరిగే అవకాశం ఉంది. తొలుత ఫిబ్రవరి 17న శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించాలని భావించినా తర్వాత వాయిదా వేశారు. సీఎం పేరును నిర్ణయించే ముందు పార్టీ తన ఎమ్మెల్యేలతో ఈ శాసనసభాపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.
ముఖ్యంగా వినిపిస్తున్న పేర్లు ఇవే..
ముఖ్యమంత్రి ఎంపికక సంబంధించి గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్నతస్థాయి చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నాయకత్వం మౌనంగా ఉన్నప్పటికీ.. పర్వేష్ వర్మ, ఆశిష్ సూద్, రేఖా గుప్తాతో సహా అనేక మంది పేర్లపై ఊహాగానాలు వస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో కమలం పార్టీ ప్రకటించింది. ప్రధాని మోడీ ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఫ్రాన్స్, అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే.

ఢిల్లీ సీఎం రేసులో.. ఆ ఆరుగురు ముందంజ
ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ఉన్న పేర్లలో పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు. ఆయన న్యూఢిల్లీ స్థానంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను ఓడించారు. కేంద్ర నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శి, జనక్ పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్ పేరు కూడా చర్చనీయాంశమవుతోంది. మహిళా నేతలలో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా కూడా సీఎం పదవికి పోటీదారుగా పరిగణించబడుతున్నారు. ఢిల్లీ బీజేపీలో అత్యంత సీనియర్ నాయకులలో ఒకరైన,ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రోహిణి ఎమ్మెల్యే విజేందర్ గుప్తా పేరు కూడా చర్చలో ఉంది.
మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ కూడా రేసులో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ కు బలమైన ప్రతినిధి అయిన జితేంద్ర మహాజన్ కూడా సీఎం పదవికి పోటీ పడుతున్న వారిలో అగ్రస్థానంలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ అధిష్ఠానం ఒక మహిళను లేదా పూర్తిగా కొత్త ముఖాన్ని ఎంచుకునే అవకాశం ఉందని పార్టీ నాయకులు సూచనప్రాయంగా చెబుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరభ్ భరద్వాజ్ ను ఓడించి గెలిచిన శిఖా రాయ్ కూడా సీఎం పదవికి పరిగణించబడుతున్నట్లు సమాచారం.
మంత్రి పదవులకు 15 మంది పేర్లు షార్ట్ లిస్ట్
కీలక మంత్రి పదవులకు 15 మంది ఎమ్మెల్యేలను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ కొత్త ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి ఉండే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయాన్ని ఖరారు చేసేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ అగ్రనాయకుల సమావేశం కానున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 70 స్థానాలకు గానూ 48 సీట్లను గెలుచుకుంది. ఫిబ్రవరి 8న ప్రకటించిన ఢిల్లీ ఫలితాల్లో 10 సంవత్సరాలకు పైగా పాలించిన ఆప్ కేవలం 22 సీట్లను మాత్రమే గెలుచుకున్న సంగతి తెలిసిందే. 1993 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications