వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

CDS జనరల్ బిపిన్ రావత్ వారుసుడు ఎవరు.. ఈ నియామకాన్ని ఎలా చేపడతారు..?

|
Google Oneindia TeluguNews

దేశానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉండాలన్న డిమాండ్ దశాబ్దాలపాటుగా ఉంది. ఈ డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నెరవేర్చింది. భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా జనరల్ బిపిన్ రావత్‌ను నియమించింది. అయితే విధి చిన్న చూపు చూడటంతో భారత తొలి సీడీఎస్‌ను హెలికాఫ్టర్ ప్రమాదం బలితీసుకుంది. మరో ఏడాది పదవీకాలం ఉండగానే హెలికాఫ్టర్ ప్రమాదంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించారు. బిపిన్ రావత్‌ మృతి దేశానికి తీరని లోటు. దేశ మిలటరీ వ్యవహారాలకు కూడా సీడీఎస్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. జనరల్ బిపిన్ రావత్ మృతితో ఈయన వారసుడిగా ఎవరు ఆ స్థానంలోకి వస్తారనే చర్చ ప్రారంభమైంది.

బిపిన్ రావత్ వారసుడెవరు..?

బిపిన్ రావత్ వారసుడెవరు..?

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అకాల మరణంతో ఆయన వారుసుడెవరా అనే చర్చ ప్రారంభమైంది.సాధారణంగా మిలటరీ నిబంధనల ప్రకారం ఒక కమాండెంట్ కొన్ని కారణాల చేత విధులకు దూరమైతే సెకండ్-ఇన్-కమాండ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి ట్రూప్‌ను లీడ్ చేస్తారు. అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం సీడీఎస్‌ వారసుడిగా మరో వ్యక్తిని తీసుకొచ్చేలా ఎలాంటి ముందస్తు నిబంధనలు లేవు. అయితే అనధికారికంగా వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఉన్నప్పటికీ ఇది సాధ్యపడదని ఎందుకంటే హోదా ప్రకారం ఆ వ్యక్తికి మూడు స్టార్లు ఉంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు త్రివిధ ధళాలకు చెందిన చీఫ్‌లు ఏదైనా కారణాల చేత తమ విధులను నిర్వర్తించలేని సందర్భంలో వైస్ చీఫ్ ఆ బాధ్యతలను చేపడతారు. అంటే ప్రభుత్వం మరో వ్యక్తిని పూర్తిస్థాయిలో చీఫ్‌గా నియమించేవరకు వైస్ చీఫ్ ఆ విధులను నిర్వర్తిస్తారు. అయితే నియమింపబడే వ్యక్తి వైస్ చీఫ్ అయి ఉండక్కర్లేదు. ఏ వ్యక్తికైనా ఆ అర్హతలుంటే ప్రభుత్వం ఇష్టప్రకారం మేరకు నియమిస్తుంది.

 సీడీఎస్ విషయంలో నిబంధనలేంటి..?

సీడీఎస్ విషయంలో నిబంధనలేంటి..?

సీడీఎస్ విషయంలో అలా ఉండదు. ఇక్కడ డిప్యూటీ అంటూ ఎవరూ ఉండరు. అయితే ఇది పూర్తిగా ప్రభుత్వం అభీష్టం మేరకే ఉంటుంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే తాత్కాలికంగా లేదా శాశ్వతపరమైన నియామకం చేయొచ్చు. అయితే భద్రతపై కేబినెట్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని సమాచారం. సీడీఎస్ అనే పోస్టులో మిలటరీలో సేవలందించిన వ్యక్తి ఉంటాడు. అదే సమయంలో కార్యదర్శి హోదాలో బ్యూరోక్రాట్‌లా కూడా వ్యవహరిస్తారు. అందుకే నేరుగా వారసత్వం హోదా అనేది ఇక్కడ ఉండదు. రాజకీయపరమైన నిర్ణయం మేరకే సీడీఎస్ పోస్టును భర్తీ చేయడం జరుగుతుంది. మిలటరీ సర్వీసులో యాక్టివ్‌గా ఉండరు.. కానీ మిలటరీ వ్యవహారాల్లో బ్యూరోక్రాట్ విధులను సీడీఎస్ నిర్వర్తిస్తారు. ఒకప్పుడు దీన్ని సాధారణ బ్యూరోక్రాట్లు చూసేవారు. కానీ సీడీఎస్ వచ్చాక ఆ బాధ్యతలు కార్యదర్శి హోదాలో ఆయనకు అప్పగించడం జరిగింది.

Recommended Video

IAF Mi 17 V5 : Russian Made Chopper Facts Explained || Oneindia Telugu
త్రివిధ దళాలకు అధిపతిగా సీడీఎస్

త్రివిధ దళాలకు అధిపతిగా సీడీఎస్


జనరల్ రావత్ అకాల మరణంతో త్రివిధ దళాలకు అధిపతి పోస్టు ఖాళీ అయ్యింది. త్రివిధ దళాల చీఫ్‌లలో అంటే ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్‌లలో ... ఆర్మీ చీఫ్ అయిన ఎంఎం నరవాణే సర్వీస్ పరంగా సీనియర్‌గా ఉన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్‌గా త్రీస్టార్ ఆఫీసర్ ఎటూ ఉన్నారు. ఇతను వైస్ చీఫ్ ఆఫ్ సర్వీస్ హోదాను అనుభవిస్తారు. సీడీఎస్ పోస్టును క్రియేట్ చేసిన సమయంలో వైస్ చీఫ్ ఆఫ్ సర్వీస్‌ హోదా ఉన్న వ్యక్తినే వైస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా నియమించాలని నాడు భావించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం ఆ హోదాలో ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ ఉన్నారు. ఏవైనా అధికారిక కార్యక్రమాలకు లేదా సెరిమోనియల్స్‌కు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అందుబాటులో లేకుంటే ఈ కార్యక్రమాలన్నిటినీ వైస్ చీఫ్ ఆఫ్ సర్వీసెస్ నిర్వర్తిస్తారు. కానీ అధికార నిర్ణయాలు మాత్రం తీసుకునేందుకు ఆ హోదాలో ఉన్న వ్యక్తికి ఉండవు. ఇక త్రీ స్టార్ హోదా ఉన్న ఆఫీసర్‌ను జనరల్‌ ర్యాంకుతో ప్రమోట్ చేసి ఆపై సీడీఎస్‌గా ప్రభుత్వం నియమించొచ్చని ఉన్నత వర్గాలు చెబుతున్నాయి. అదికూడా ప్రస్తుతం ఉన్న త్రివిధదళాల అధిపతులలో ఒక్కరిని సీడీఎస్‌గా ప్రమోట్ చేయకపోతే మరో వ్యక్తిని జనరల్ ర్యాంకుతో ప్రమోట్ చేసి సీడీఎస్‌గా నియమించొచ్చని తెలుస్తోంది.

English summary
After CDS General Bipin Rawat death in the helicopter crash, now debate is going on as who will be Bipin Rawat's successor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X