మ్యాగీ నూడుల్స్ వివాదం: చిక్కుల్లో నటి మాధురీ దీక్షిత్

డెహ్రాడూన్‌: ప్రముఖ బాలీవుడ్‌నటి మాధురీ దీక్షిత్‌ వివాదంలో చిక్కుకున్నారు. మ్యాగీ నూడుల్స్‌లో మోనో సోడియం గ్లూటామేట్‌ (ఎంఎస్ జీ) ఉందంటూ వివాదం తలెత్తిన నేపథ్యంలో ఈ ప్రకటనలో నటించిన మాధురీకి ఉత్తరప్రదేశ్‌ ఆహార, ఔషధ సంస్థ నోటీసులు జారీచేసింది.

రెండు నిమిషాల్లోనే ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం సిద్ధమంటూ ప్రకటనలో కనిపించిన మాధురీ పదిహేను రోజుల్లో ఈ నోటీసులకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. లేని పక్షంలో ఈ బాలీవుడ్‌ నటిపై కేసు నమోదు చేస్తామని యూపీ ఆహార భద్రత అధికారి మహిమానంద్‌ జోషి తెలిపారు.

Why Actress Madhuri Dixit is Now Caught in Maggi Noodle Controversy

మ్యాగీలో పరిమితికి మించి అనారోగ్యకారకాలున్నాయని వస్తున్న ఆరోపణల విషయంలో నెస్ట్లె ఇండియాపై విచారణ జరిపించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థను కేంద్ర మంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ ఆదేశించారు.

అంతేకాకుండా, జాతీయ వినియోగదారుల వివాదాలు, పరిహారాల సంస్థ (ఎన్సీడీఆర్సీ)తో ‘క్లాస్‌ యాక్షన్‌ సూట్‌' దాఖలు చేయించాలన్నారు. అయితే తమ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలను నెస్ట్లె ఇండియా ఖండించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+