శరద్ పవార్ చేసిన చిన్న పొరపాటు వల్లే..
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్.. ఊహించని విధాంగా షాక్ ఇచ్చారు. శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం)- బీజేపీ కూటమి ప్రభుత్వానికి జైకొట్టారు. షిండే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు. ఉప ముఖ్యమంత్రిగానూ ప్రమాణ స్వీకారం చేశారు.
ఆయనతో పాటు తొమ్మిది మంది ఎన్సీపీ శాసన సభ్యులు- హసన్ ముష్రిఫ్, ఛగన్ భుజ్‌బల్, దిలీప్ వల్సే పాటిల్, ధనంజయ్ ముండే, ఆదితి టత్కరే, సంజయ్ బాబురావ్ బన్సొడే, అనిల్‌భాయ్ దాస్ పాటిల్, ఆత్రమ్ ధర్మారావ్ బాబా భగవంత్ రావ్.. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముంబైలోని రాజ్‌భవన్‌లో ఈ మధ్యాహ్నం గవర్నర్ రమేష్ బైస్ వారితో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఏ మాత్రం గుట్టుచప్పుడు కాకుండా.. అజిత్ పవార్ ఇంత పెద్ద ఎత్తున ఎన్సీపీలో తిరుగుబాటును లేవనెత్తడం, చీలికను తీసుకుని రావడానికి కారణాలు లేకపోలేదు. నిజానికి అజిత్ పవార్ ఎలాంటి క్యాంప్ రాజకీయాలు చేయలేదు. ఎమ్మెల్యేలను రిసార్టులకు తరలించలేదు. పార్టీ అధిష్ఠానంతో బేరసారాలు పెట్టలేదు. తిరుగుబాటు జరుగుతోందని తెలుసుకునే లోపలే సీన్ మొత్తం రివర్స్ అయింది.
మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీకి ఉన్న శాసన సభ్యుల బలం 56.. ఇందులో ఏకంగా 40 మందిని మూడో కంటికి తెలియకుండా తన వైపు తిప్పుకోగలిగారు అజిత్ పవార్. మరో ఆరుమంది ఎమ్మెల్సీలు కూడా ఆయనకు మద్దతు ప్రకటించారు. వారందరినీ తనతో తీసుకెళ్లారు. దీనితో ఎన్సీపీ దాదాపుగా ఖాళీ అయినట్టే కనిపిస్తోంది.
అజిత్ పవార్ తిరుగుబాటు లేవనెత్తడానికి ప్రధాన కారణం- ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తీసుకున్న నిర్ణయమే. గతంలో పార్టీ అధినేతగా శరద్ పవార్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో పార్టీ నాయకులు మొత్తం, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించారు. వారి డిమాండ్లను గౌరవించిన శరద్ పవార్.. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.

అదే సమయంలో- తన కుమార్తె సుప్రియా సులే, సీనియర్ నేత ప్రఫుల్ పటేల్‌ను పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులుగా నియమించారు. అది- అజిత్ పవార్‌లో అసంతృప్తి లేవదీయడానికి కారణమైంది. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని ఆశించిన అజిత్‌కు చుక్కెదురైంది.
అప్పటి నుంచి ఆయన చాపకింద నీరులా తన పని తాను చేసుకుంటూ వెళ్లినట్లు చెబుతున్నారు. తనకు అండగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరినీ ఏకతాటిపైకి తీసుకుని రాగలిగారు. ఇంత జరుగుతున్నా కొంచెం కూడా లీక్ కాకుండా జాగ్రత్త పడగలిగారు. అనూహ్యంగా శరద్ పవార్‌ను దెబ్బకొట్టగలిగారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications