Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పెప్సీకి ప్రచారం ఎందుకు మానేశానంటే: అమితాబ్ క్లారిఫై

ముంబై: ఒకప్పుడు పెప్సీ కూల్ డ్రింక్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేసిన బాలీవుడ్ సూపర్ స్టార్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇటీవలే దాన్ని విషంతో పోల్చారు. ఐఐటీ అహ్మదాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో అమితాబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడారు.

గతంలో పెప్సీకి మద్దతుగా ప్రచారం చేశానని, రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్‌లోని ఒక పాఠశాలకు వెళ్లినప్పుడు ఒక బాలిక తనను కూల్ డ్రింక్స్ విషయమై ఓ ప్రశ్న వేసిందని ఆయన చెప్పారు. హానికారక పదార్థాలు ఉన్న పెప్సీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నారని ఆ బాలిక తనను ప్రశ్నించింది, ఆ తర్వాత దానికి ప్రచారం నిలిపివేశానని ఆయన తెలిపారు.

 Amitabh Bachchan

తద్వారా తాను పెప్సీ కూల్ డ్రింక్‌కు మద్దతుగా ప్రచారం నిలిపివేయడానికి గల కారణాలను అమితాబ్ చెప్పారు. ఆ బాలిక తనను డ్రింక్స్ విషయం అడగడం ద్వారా తాను ఎలాంటి సూచనలు ఇస్తున్నాననో తనకు అర్థమైందని అమితాబ్ చెప్పారు. ఇది సరికాదని భావించి తాను ప్రచారం చేయడాన్ని ఆపేశానన్నారు.

బిగ్ బి 2002 నుండి ఎనిమిదేళ్ల పాటు పెప్సీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. కాగా, ఇటీవల సామాజిక వెబ్ సైట్ ట్విట్టర్లోను ఆయన ఈ అంశంపై స్పందించారు. ఆ బాలిక తనను ప్రశ్నించేటప్పటికే తన రూ.24 కోట్ల ఒప్పందం పూర్తయ్యే టైం దగ్గర పడిందన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+