కేజ్రీవాల్ ప్రమాణానికి అన్నానో: అమ్మ తర్వాత రాహులే

న్యూఢిల్లీ: ప్రముఖ సామాజికవేత్త అన్నా హజారే, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ఈ నెల 26వ తేదీన ప్రమాణ స్వీకారం చేసేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే.

ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి తాను హాజరు కావడం లేదని అన్నా హజారే చెప్పారు. తనకు ఇప్పటి వరకు ఎఎపి నుండి ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని ఎలాంటి ఆహ్వానం అందలేదని, అందుకే తాను హాజరు కాబోవడం లేదన్నారు. అంతేకాకుండా తన ఆరోగ్యం కూడా బాగాలేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్ 26న రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతి కోరారు. అయితే ఇది ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

Why Anna will not attend Arvind Kejriwal's swearing in ceremony

ఎఎపికి మద్దతుపై ద్వివేది

ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతిచ్చే విషయంలో తమ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది వేరుగా అన్నారు. పార్టీలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తర్వాత స్థానం ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీదే అన్నారు. రాహులే కాంగ్రెసు భవిష్యత్తు నేత అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజా సమస్యలు లేవెనత్తాలని ప్రజలు తమకు తీర్పునిచ్చారన్నారు.

రాహుల్ ప్రధాని అభ్యర్థి

2014 ఎన్నికలలో రాహుల్ గాంధీ తమ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి అని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ చెప్పారు. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శలు సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+