జయ తల్లి సరే, శోభన్ బాబును తండ్రిగా ఎందుకు... : అమృతకు ప్రశ్న

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: దివంగత నేత జయలలితను తల్లి అని చెబుతున్నారు సరే, మరి తండ్రిగా శోభన్‌బాబు పేరును పిటిషన్‌లో ఎందుకు పేర్కొనలేదని మద్రాసు హైకోర్టు బెంగళూరు యువతి అమృతను అడిగిది. శోభన్ బాబు నుంచి రావాల్సిన హక్కులు ఎందుకు అడగడం లేదని కూడా ప్రశ్నించింది.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత తన తల్లి అని, నటుడు శోభన్‌బాబు -జయలలితలకు తాను జన్మించానని, దాన్ని నిరూపించచడానికి తనకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలంటూ బెంగళూరుకు చెందిన అమృత గురువారం మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది.

పిటిషన్‌లో మార్పులు చేసి మళ్లీ.

పిటిషన్‌లో మార్పులు చేసి మళ్లీ.

పిటిషన్‌లో తగిన మార్పులు చేసి మళ్లీ దాఖలు చేయాలని న్యాయమూర్తి చేసిన సూచన మేరకు శుక్రవారం అమృత తరఫు న్యాయవాది ప్రకాష్‌ మళ్లీ పిటిషన్‌ను దాఖలు చేసి, వాదనలు వినిపించారు.

వారినీ కేసులో చేర్చాలి...

వారినీ కేసులో చేర్చాలి...

డీఎన్‌ఏ పరీక్షల కోసం జయలలిత సమీప బంధువులైన దీప, దీపక్‌నూ కేసులో చేర్చాలని అమృత తరఫు కోరారు. జయ కూతురు అని నిరూపించేందుకు కనీస ఆధారాలు కూడా లేకుండా దాఖలైన పిటిషన్‌ విచారణకు అర్హమైనది కాదని వాదిస్తూ దానిని తోసిపుచ్చాలని అడ్వొకేట్‌ జనరల్‌ విజయనారాయణ్‌ కోరారు.

కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశాలు..

కౌంటర్ అఫిడవిట్‌కు ఆదేశాలు..

అమృత పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌లు వేయాలని మద్రాసు హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌కు, జయ మేనకోడలు దీపా, మేనల్లుడు దీపక్‌లకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ జనవరి 5కి వాయిదా పడింది.

జయ, శోభన్ బాబులపై ఊహాగానాలు...

జయ, శోభన్ బాబులపై ఊహాగానాలు...

జయలలిత, శోభన్ బాబుల మధ్య రోమాన్స్ నడిచిందంటూ 1970 ప్రాంతంలో ఊహాగానాలు చెలరేగారు. శోభన్ బాబును తండ్రిగా ప్రకటించాలని ఎందుకు అడగడం లేదనే ప్రశ్నకు అమృత తరఫు న్యాయవాది నేరుగా సమాధానం చెప్పలేదు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Justice Vaidyanathan of the Madras High Court questioned Amrutha has never asked to establish legality of Sobhan Babu being her father.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి