citizenship bill: ‘బలమైన నేతలున్నా పాక్‌ను ఎందుకు నాశనం చేయడం లేదు?’
న్యూఢిల్లీ: విపక్షాలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నాయంటూ ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కౌంటర్ ఇచ్చారు. మనది పాకిస్థా అసెంబ్లీ కాదని.. ఇక్కడ అందరూ ప్రజలతో ఎన్నికైన వారే ఉన్నారని ఆయన అన్నారు.
ఒకవేళ మనం పాకిస్థాన్ భాషను వ్యతిరేకించినట్లయితే.. మన బలమైన ప్రభుత్వం ఆ దేశాన్ని ఎందుకు నాశనం చేయడం లేదని సంజయ్ రౌత్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రధానమంత్రి పదవిలో, హోంమంత్రి పదవిలో చాలా బలమైన వ్యక్తులున్నారని.. అయినా ఎందుకు పాకిస్థాన్‌ను నాశనం చేయలేకపోతున్నామని అన్నారు.
citizenship bill: రాజ్యసభ టీవీ ప్రసారాల నిలిపివేత: ఎందుకంటే.?

శరణార్థులకు ఓటు హక్కు ఉంటుందా?
అంతేగాక, పౌరసత్వ బిల్లుపైనా ఆయన స్పందించారు. పౌరసత్వ బిల్లు ద్వారా శరణార్థులు భారతదేశంలో ఓటర్లుగా మారిపోతారా? అని సంజయ్ రౌత్ ప్రశ్నించారు.
మీరు చదవిని పాఠశాలకు తాము ప్రధానోపాధ్యాయుల లాంటివారిమని ఆయన అమిత్ షాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాకిస్థాన్‌లో మైనార్టీల హక్కులకు భంగం కలుగుతుందని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌ను ఎందుకు నాశనం చేయలేదని ప్రశ్నించారు.

రాజ్యసభలో బిల్లు..
కాగా, సోమవారం లోక్‌సభలో పౌరసత్వ సవరణ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. లోక్‌సభలో బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 80 ఓట్లు వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రానుంది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలుండగా.. ఇందులో బీజేపీకి 83 స్థానాలున్నాయి.

బీజేపీకి సానుకూలంగా
బీజేపీకి సానుకూలంగా ఉన్న జేడీయూ, ఎస్ఏడీ, ఏఐఏడీఎంకే, బీజేడీ, వైసీపీతో బిల్లును ఆమోదింపజేయాలని కేంద్రం భావిస్తోంది. ఈ పార్టీల మద్దతుతో తమ సంఖ్య 128కి చేరుతుందని కేంద్రం భావిస్తోంది. 112 కంటే ఎక్కువ ఓట్లు పడితే బిల్లుకు ఆమోదం లభించే అవకాశం ఉంది. 2014 డిసెంబర్ 31 వరకు పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి మన దేశానికి వచ్చిన ముస్లిమేతరులకు ఈ బిల్లు ద్వారా భారత పౌరసత్వం కల్పించడం జరుగుతుంది.












Click it and Unblock the Notifications