తెల్లవాళ్ల ముందు దుస్తులు ఊడదీస్తాం, కానీ: కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సహాయమంత్రి కేజే అల్ఫోన్స్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆధార్ డేటాబేస్‌కు రక్షణ కల్పించాలంటూ ఆందోళన చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆధార్‌ను ప్రశ్నించే వారు వీసా కోసం తెల్లవారి ముందు నగ్నంగా నిలబడటానికి సిద్ధమవుతురాని ఆరోపించారు. వీసా కోసం దుస్తులు విప్పేందుకు కూడా సిద్ధమవుతారన్నారు. ఆధార్ గురించి సమాచారం ఇమ్మంటే మాత్రం విప్లవం వస్తుందన్నారు.

అమెరికా వీసా కోసం తాను పది పుటల దరఖాస్తును నింపానని, అలాంటి పని కోసమయితే తెల్లవాళ్ల ముందు మనం వస్త్రాలు లేకుండా నిలబడమన్నా నిల్చుంటామన్నారు.












Click it and Unblock the Notifications