వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టార్గెట్ నితీశ్ కుమార్: ఏ పార్టీ, నేతలైనా సరే విమర్శలు.. కారణమిదేనా..

|
Google Oneindia TeluguNews

బీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ పేరు బాగా వినిపిస్తోంది. కాదు నితీశ్ వర్సెస్ మిగతా నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు కారణం ఏంటీ..? ఆర్జేడీ, బీజేపీ, ఎల్జేపీ నేతల పేర్లు ఎందుకు ప్రధానంగా వినిపించడం లేదంటే చాలా కారాణలు కనిపిస్తున్నాయి. అవేంటో లుక్కేద్దాం పదండి.

ఉద్దండుడు..

ఉద్దండుడు..

నితీశ్ కుమార్.. రాజకీయ ఉద్దండుడు. మూడుసార్లు కఠిన సమయాల్లో సీఎంగా పనిచేశారు. కష్టకాలంలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి నడిపిస్తున్నారు. దీంతో ఆయనను విమర్శిస్తే మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్, నితీశ్‌పై విమర్శలు చేయడంలో ముందున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమ వైపు మళ్లించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

అందరీ టార్గెట్ ఇతనే..

అందరీ టార్గెట్ ఇతనే..


ఆర్ఎల్ ఎస్పీ నేత ఉపేంద్ర కుష్వావా, జేఏపీ పప్పూ యాదవ్, భీమ్ ఆర్మీ చంద్రశేఖర్ కూడా నితీశ్ కుమార్ లక్ష్యంగా కామెంట్లు చేస్తున్నారు. కానీ ఒక్కసారిగా ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ కూడా నితీశ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. కానీ వీరి ఎవరి పట్ల నితీశ్ భయపడటం లేదు. కానీ తేజస్వి యాదవ్ అంటే మాత్రం కాస్త భయంగానే ఉన్నారు. ఎందుకంటే తమ పార్టీ అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తేజస్వి యాదవ్ హామీ ఇస్తున్నారు. ఇదీ తమ పార్టీపై ప్రభావం చూపిస్తోందని నితీశ్ కుమార్ అంచనా వేస్తున్నారు.

Recommended Video

Bihar Polls : Article 370 పునరుద్ధరన Bihar నుంచి అమరవీరులైన జవాన్లకు అవమానం! - PM Modi
తెరపైకి చిరాగ్ పేరు

తెరపైకి చిరాగ్ పేరు

ఎన్నికల వేళ చిరాగ్ పాశ్వాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. అంతకుముందే చిరాగ్‌కు రాం విలాస్ పాశ్వాన్ పార్టీ పగ్గాలు అప్పగించారు. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పాశ్వాన్ మృతి ఎల్జేపీ క్యాష్ చేసుకునే పనిలో పడింది. అయితే జేడీయూ నేతలు మాత్రం చిరాగ్ పాశ్వాన్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. దీంతోపాటు బీజేపీ కార్యకర్తల నుంచి ప్రతికూలత ఏర్పడుతోంది. నితీశ్ నాయకత్వాన్ని 50 శాతం వరకు అంగీకరించడం లేదు. ఇవన్నీ జేడీయూకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. అయితే 3 సార్లు సీఎంగా గెలిచిన.. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో విపక్షాలు పడ్డాయి. అవీ ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలీ.

English summary
Nitish Kumar faces multiple challengers in the Bihar election. Weeks ago, the ruling NDA would not have imagined so many rivals ranged against the Chief Minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X