శశికళ ఫ్యామిలీ టార్గెట్: కరుణానిధి ఇంటిలో ఎందుకు ఐటీ దాడులు చెయ్యలేదు, బీజేపీ ఎంపీ !

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: శశికళ కుటుంబ సభ్యుల ఇళ్లు, కార్యాలయాల మీద ఆదాయపన్ను శాఖ అధికారుల దాడులు చేస్తున్న సమయంలో బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి స్పంధించారు. సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలతో తమిళనాడు బీజేపీ నాయకులు ఇరకాటంలో పడ్డారు.

జయలలిత వైద్యుడి ఇంటిపై ఐటీ దాడులు, శశికళ అక్క కుమార్తె ప్రభా, డాక్టర్ శివకుమార్!

శశికళ మీద కోర్టుకు ఫిర్యాదు చేసిన సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి, ఆయన కుమార్తె కనిమోళిని మీద అధికారులకు 30 పేజీల వివరాలు ఇచ్చి ఫిర్యాదు చేశానని, అయితే వారి ఇంటి మీద ఎందుకు ఆదాయ పన్ను శాఖ దాడులు చెయ్యడం లేదు అంటూ గురువారం సోషల్ మీడియాలో సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు.

 Why no raids on M Kaurunanidhi and kanimozhi says Subramanian Swamy

బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేసిన తరువాత సోషల్ మీడియాలో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. శశికళ కుటుంబ సభ్యుల మీద దాడులకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, ఐటీ శాఖ అధికారులు వారిపని వారు చేసుకుని వెలుతున్నారని తమిళనాడు బీజేపీ నాయకులు అంటున్నారు.

శశికళ లిక్కర్ కంపెనీ మిడాస్ లో ఐటీ అధికారులు, దివాకరన్ విచారణ, 187 చోట్లు సోదాలు !

ఇలాంటి సందర్బంలో సొంత పార్టీ నేతలను ఇరుకున పెట్టే రీతిలో సుబ్రమణ్యస్వామి స్పంధించారు. ప్రధాని నరేంద్ర మోడీ చెన్నై పర్యటన సందర్బంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ చీఫ్ ఎం. కరుణానిధి ఇంటికి వెళ్లి వచ్చిన సందర్బంలో బీజేపీలోని సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి ఇలా స్పంధించడంతో తమిళనాడులోని ఆ పార్టీ నాయకులు ఉలిక్కిపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In addition to data on Sasikala in the courts I had given a 30 page Note to Authorities on M Karunanidhi and daughter Kanimozhi frauds. Why no raids yet? BJP leader Subramanian Swamy has asked. Will Narendra Modi answer to this question by Swamy?

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి