బెంగాల్లో కనిపించని రాహుల్‌, ప్రియాంక- కేరళ ఎన్నికలతో లింక్‌-షాకింగ్‌ రీజన్‌

హోరాహోరీగా సాగిపోతున్న పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో ఎక్కడ చూసినా మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ముఖాముఖీ పోరు కనిపిస్తోంది. మరో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ జాడలేకుండా పోతోంది. దీనికి ప్రధాన కారణం అక్కడ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీతో పాటు ఇతర సీనియర్‌ నేతలు కూడా మొహం చాటేయటమే. ఓవైపు లెఫ్ట్‌ పార్టీలతో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేస్తూ బెంగాల్‌ ఎన్నికల ప్రచారానికి వీరు దూరంగా ఉండటం వెనుక ఓ ఆసక్తికర కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

 బెంగాల్లో కనిపించని రాహుల్, ప్రియాంక

బెంగాల్లో కనిపించని రాహుల్, ప్రియాంక

పశ్చిమబెంగాల్లో రెండో దశ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు రెండోదశ పోలింగ్‌ జరగబోతోంది. రెండు దశల ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. అయితే కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా వాద్రా మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. మిగతా రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న రాహుల్‌, ప్రియాంక, ఇతర కాంగ్రెస్‌ సీనియర్లు బెంగాల్‌ ప్రచారానికి మాత్రం మొహం చాటేశారు. దీంతో వీరు బెంగాల్ రాకపోవడానికి వెనుక కారణాలపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

కేరళలో లెప్ట్‌తో కాంగ్రెస్‌ పోరాటం

కేరళలో లెప్ట్‌తో కాంగ్రెస్‌ పోరాటం


కేరళలో అధికారంలో ఉన్న లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఆధ్వర్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమితో కాంగ్రెస్ అధ్వర్యంలోని యూడీఎఫ్‌ కూటమి తలపడుతోంది. ఈ వచ్చే నెల 6న అక్కడ ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ ఎల్టీఎఫ్‌ను మరోసారి అధికారంలోకి రానివ్వకుండా కాంగ్రెస్‌ ఆధ్వర్వంలోని యూడీఎఫ్ గట్టి పోటీ ఇస్తోంది. అయితే కేరళలో ఎల్‌డీఎఫ్‌ సర్కారుకు మరో అవకాశం దక్కవచ్చంటూ సర్వేలు చెబుతున్నాయి. అయినా యూడీఎఫ్ మాత్రం ఆశలు వదులుకోవడం లేదు. ఇక్కడ లెఫ్ట్‌ సర్కారుకు వ్యతిరేకంగా రాహుల్‌ గాంధీ తీవ్రంగా ప్రచారం చే్స్తున్నారు. విజయన్‌ సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు.

బెంగాల్లో లెఫ్ట్‌తో కాంగ్రెస్‌ పొత్తు

బెంగాల్లో లెఫ్ట్‌తో కాంగ్రెస్‌ పొత్తు


కేరళలో ఎల్టీఎఫ్‌ను నడుపుతున్న లెఫ్ట్‌ పార్టీలపై హోరాహోరీ పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీ.. బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం లెఫ్ట్‌ కూటమితో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగింది. ఒకప్పుడు బెంగాల్‌ను అప్రతిహతంగా ఏలిన కమ్యూనిస్టులను నామమాత్రంగా మార్చేసిన మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓవైపు, సిద్ధాంత పరంగా విభేదాలు ఉన్న బీజేపీతో మరోవైపు పోరాటం చేస్తున్న లెఫ్ట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ ఇక్కడ చురుగ్గా ప్రచారం చేస్తోంది. ఇండియన్ సెక్యులర్‌ ఫ్రంట్, లెఫ్ట్ పార్టీలతో కూడిన కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ పార్టీకి అగ్రనేతలు రాహల్‌, ప్రియాంకల ప్రచార భాగ్యం మాత్రం కలగడం లేదు. దీంతో వారిలో నిరాశ పెరుగుతోంది.

కేరళ కోసం బెంగాల్‌కు దూరమైన రాహుల్‌, ప్రియాంక

కేరళ కోసం బెంగాల్‌కు దూరమైన రాహుల్‌, ప్రియాంక


కేరళలో లెఫ్ట్‌ కూటమితో పోరాటం చేస్తూ మరోవైపు బెంగాల్లో లెఫ్ట్‌ కూటమికి మద్దతుగా ప్రచారం చేస్తే విమర్శలు తప్పవని భావిస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌, ప్రియాంక ఇక్కడ ప్రచారానికి దూరమయ్యారు. ఇప్పటివరకూ బెంగాల్‌ ప్రచారంలో వీరు పాల్గొనకపోవడం వెనుక ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఏప్రిల్ 6న కేరళలో ఎన్నికలు ముగిశాక బెంగాల్‌లో ప్రచారానికి రావాలని వీరు కోరుకుంటున్నారు. ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పకపోయినా బెంగాల్లో కాంగ్రెస్‌ స్ధానిక నేతలకు ఇప్పటివరకూ ప్రచార షెడ్యూల్‌ ఇవ్వకపోవడం వెనుక ఇదే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+