ఆ గది కలిసొచ్చింది.. సభలో కుమారస్వామి

బెంగళూరు : బలపరీక్ష సందర్భంగా కర్ణాటక సీఎం చేసిన పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత తాను ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు ఆ చోటే తనకు లక్కీ అని .. బలపరీక్ష సందర్భంగా చెప్పడం గమనార్హం. విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తమ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు.

14 నెలల క్రితం కర్ణాటకలో ఎన్నికలు ముగిసి, ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఆ సమయంలో జేడీఎస్ చీఫ్ కుమారస్వామి ఎక్కడున్నారో తెలుసా ? తాజ్ వెస్టెండ్ హోటల్‌‌లో ఓ గదిలో ఉన్నారు. అంతేకాదు ఆ గది తనకు కలిసొచ్చిన గది అని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి .. ఫలితాలు వెలువడుతున్నాయని .. ఆ సమయంలో తాను తాజ్ వెస్టెండ్‌లో ఓ గదిలో ఉన్నానని తెలిపారు. సరిగ్గా అప్పుడే తనకు గులాం నబీ ఆజాద్ నుంచి ఫోన్ వచ్చిందని పేర్కొన్నారు. వారు ఫోన్ చేయడంతో తమ పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాడే ప్రభుత్వానికి మద్దతు తెలుపుతామని చెప్పినట్టు గుర్తుచేశారు. ఇదే కాదు .. తాను చాలాసార్లు ఆ గదిలో ఉన్నప్పుడు మంచి వార్తలు విన్నానని తెలిపారు.

why that room lucky .. says kumara swami

కర్ణాటక అసెంబ్లీలో సంకీర్ణ సర్కార్ మైనార్టీలో ఉంది. బలపరీక్ష చర్చ తర్వాత కుమారస్వామి సర్కార్ పడిపోతుంది. విపక్ష బీజేపీ నెగ్గి.. అధికారం చేపట్టబోతుంది. ఈ సందర్భంగా రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలను ప్రత్యేంకగా గుర్తుచేశారు కుమారస్వామి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+