Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మేం జాత్యాహంకారులం కాదు.. అంటూనే దక్షిణాదిపై బీజేపీ నేత తీవ్రవ్యాఖ్య

భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపి తరుణ్ విజయ్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. భారతీయులు జాత్యాహంకారులు కాదని, అదే నిజమైతే తాము దక్షిణాది వారితో కలిసి ఎలా జీవిస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపి తరుణ్ విజయ్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారు. భారతీయులు జాత్యాహంకారులు కాదని, అదే నిజమైతే తాము దక్షిణాది వారితో కలిసి ఎలా జీవిస్తున్నామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

భారత దేశంలో జాతి వివక్ష లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అందుకు దక్షిణాదితో ఎలా కలిసి ఉంటున్నామని ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయింది.

"Why would we live with South Indians if we were racist," Ex BJP MP Tarun Vijay

మేం జాత్యాహంకారులం అయితే తమిళులు, కేరళ, కర్నాటక, ఆంధ్రాకు చెందిన దక్షిణాది వారితో ఎలా కలిసి ఉంటున్నామని ప్రశ్నించారు. మేం నల్లగా ఉంటామని, మా చుట్టు నల్లవారు ఉన్నారని చెప్పారు.

ఇద్దరు నైజీరియన్లపై నోయిడాలో దాడి జరిగింది. దీనిపై ఆయన ఆల్ జజీరా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

భారతీయులు జాత్యాహంకారులు అనడం దుర్మార్గం అన్నారు. తాము నల్లనివాడైన శ్రీ కృష్ణుడిని పూజిస్తామని చెప్పారు. తమకు జాతి వివక్ష ఉంటే సౌతిండియన్లతో ఎలా కలిసి ఉంటామన్నారు.

మాలోను, మా చుట్టు కూడా నల్ల జాతీయులు ఉన్నారని చెప్పారు. వివిధ వర్గాలకు చెందినప్పటికీ పరస్పరం సంఘర్షించుకుంటారని, కొంతకాలం క్రితం మహారాష్ట్రలో బీహారీలపై దాడులు జరిగాయని, మరాఠీలను బీహార్లో బెదిరించారని, ఇవన్నీ జాత్యాహంకార దాడులు కాదన్నారు. ఆయన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+