Wife: భార్య కనపడలేదని మిస్సింగ్ కేసు పెట్టి భర్త కాలక్షేపం, బెండ్ తీస్తే ?, నాకంటే అందంగా ఉందని !
అబోర్/ లక్నో: మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో అందంగా ఉన్న యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత భార్యతో అతను సంతోషంగా కాపురం చేశాడు. తన భార్య తనకంటే అందంగా, నాజుకుగా, ఎర్రగా ఉందని భర్తకు అనుమానం మొదలైయ్యింది. రానురాను భార్యతో గొడవ పడుతున్నాడు. సొంత ఊరిలో, అత్తారింటి దగ్గర ఉన్న పెద్దలు ఇప్పటి వరకు లెక్కలేనన్ని సార్లు పంచాయితీలు చేశారు. ఎంతమంది ఎన్ని పంచాయితీలు చేసినా, ఎన్ని బుద్దిమాటలు చెప్పినా భర్త తీరుమాత్రం మారలేదు. మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య కనపడటం లేదని భర్త పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు కేసు పెట్టిన భర్త అతని భార్య కనపడటం లేదని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా స్నేహితులతో కలిసి జల్సా చేస్తుండటంతో పోలీసులను అనుమానం వచ్చి అతనికి బెండ్ తియ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.

ఎంతమంది అమ్మాయిలను చూసినా ?
ఉత్తరప్రదేశ్ లోని అంబోరా ప్రాంతంలో అర్జున్ సింగ్ కాష్యప్ (25) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సంవత్సరం రోజులు అర్జున్ సింగ్ కు వివాహం చెయ్యాలని అనేక చోట్ల అమ్మాయిని చూశారు. ఎంత మంది అమ్మాయిలను చూసినా అర్జున్ సింగ్ మాత్రం తనకు ఏ అమ్మాయి ఇష్టం లేదని చెప్పాడు.

అందమైన అమ్మాయిని హ్యాపీగా పెళ్లి చేసుకున్నాడు
మూడు సంవత్సరాల క్రితం రష్మీ (24) అనే అందమైన అమ్మాయి తనకు చాలా ఇష్టమని కుటుంబ సభ్యులకు చెప్పాడు. అర్జున్ సింగ్, రష్మీల వివాహం చెయ్యాలని కుటుంబ సభ్యులు మాట్లాడుకున్నారు. మూడు సంవత్సరాల క్రితం కుటుంబ సభ్యుల సమక్షంలో అందంగా ఉన్న రష్మీని ఎగిరిగంతేసిన అర్జున్ సింగ్ ఆమెను వివాహం చేసుకున్నాడు.

మొదట హ్యాపీ.... తరువాత ?
వివాహం జరిగిన తరువాత భార్య రష్మీతో అర్జున్ సింగ్ చాలా సంతోషంగా కాపురం చేశాడు. రష్మీని బైక్ లో బంధువుల ఇళ్లకు, షికార్లకు తిప్పాడు. రానురాను తన భార్య రష్మీ తనకంటే అందంగా, నాజుకుగా, ఎర్రగా ఉందని ఆమె భర్త అర్జున్ సింగ్ కు అనుమానం మొదలైయ్యింది. రానురాను అర్జున్ సింగ్ అతని భార్య రష్మీతో గొడవ పడటం మొదలుపెట్టాడు.

విసిగిపోయి వదిలేసిన పెద్దలు
అర్జున్ సింగ్ అతని భార్య రష్మీని పట్టుకుని చితకబాదడం మొదలు పెట్టాడు. ఏదోఒక సాకు పెట్టుకుని అర్జున్ సింగ్ అతని భార్య రష్మీ మీద ప్రతాపం చూపించడం మొదలు పెట్టాడు. అర్జున్ సింగ్ సొంత ఊరిలోని పెద్దలు, అత్తారింటి దగ్గర ఉన్న పెద్దలు ఇప్పటి వరకు లెక్కలేనన్ని సార్లు అర్జున్ సింగ్, రష్మీ దంపతుల విషయంలో పంచాయితీలు చేశారు. ఎంతమంది ఎన్ని పంచాయితీలు చేసినా, ఎన్ని బుద్దిమాటలు చెప్పినా అర్జున్ సింగ్ తీరుమాత్రం మారలేదు.

పోలీసు కేసు పెట్టి కాలక్షేపం చేసిన మొగుడు
మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన భార్య రష్మీ కనపడటం లేదని ఆమె భర్త అర్జున్ సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసు కేసు పెట్టిన అర్జున్ సింగ్ అతని భార్య రష్మీ కనపడటం లేదని ఏమాత్రం ఫీలింగ్ లేకుండా స్నేహితులతో కలిసి జల్సా చేస్తుండటంతో పోలీసులను అనుమానం వచ్చింది. తరువాత అర్జున్ సింగ్ ను అదుపులోకి తీసుకుని అతన్ని బెండ్ తియ్యడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది.
Recommended Video

భార్యను చంపేసి ఇటుకల బట్టీ పక్కన పూడ్చేశాడు
గత సోమవారం భార్య రష్మీ మీద దాడి చేసి చంపేసి శవాన్ని ఊరి బయట ఉన్న ఇటుకల బట్టీ సమీపంలో పూడ్చేశాడని పోలీసుల విచారణలో అర్జున్ సింగ్ అంగీకరించాడు, అర్జున్ సింగ్ భార్య శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించామని, కేసు విచారణలో ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications