Bride: అర్దరాత్రి రైలులో కొత్త పెళ్లికూతురు ఏం స్కెచ్ వేసిందంటే ?, పెళ్లికొడుక్కి మైండ్ బ్లాక్, మేడమ్ కు ?

రాత్రి మత్తులోకి వెళ్లిన పెళ్లికొడుకు, అతని ఫ్యామిలీ ఉదయం నిద్రలేచి చూసి సరికి పెళ్లికూతురు జంప్ అయ్యింది. పెళ్లికూతురి దగ్గర లక్షల రూపాయల విలువవైన బంగారు నగలు ఉండటంతో పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు.

లక్నో/వారణాసి: యువకుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఇప్పటికే అతను అనేక పెళ్లి సంబంధాలు చూశాడు. అయితే ఓ మహిళ తనకు తెలిసిన మంచి అమ్మాయి ఉందని, నువ్వు పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖంగా ఉంటావని ఆ యువకుడికి చెప్పింది. అనుకున్నట్లే పెళ్లి జరిగింది. యువతి, యువకుడు సంతోషంగా కాపురం మొదలుపెట్టారు. బంధువుల ఇంటిలో డిన్నర్ పార్టీ ఏర్పాటు చెయ్యడంతో అదరూ అక్కడికి వెళ్లారు. రెండు రోజులు బంధువుల ఇంట్లో హ్యాపీగా ఉన్న తరువాత నవధంపతులు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఊరికి రైలులో బయలుదేరారు. రాత్రి మత్తులోకి వెళ్లిన పెళ్లికొడుకు, అతని ఫ్యామిలీ ఉదయం నిద్రలేచి చూసి సరికి పెళ్లికూతురు జంప్ అయ్యింది. పెళ్లికూతురి దగ్గర లక్షల రూపాయల విలువవైన బంగారు నగలు ఉండటంతో పెళ్లి కొడుకు షాక్ అయ్యాడు.

ముస్లీం అమ్మాయిని హిందూ అమ్మాయి అని చెప్పి ?

ముస్లీం అమ్మాయిని హిందూ అమ్మాయి అని చెప్పి ?

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో నివసించే గుడియా అనే మహిళకు, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో నివసించే అంకిత్ అనే అబ్బాయికి నిశ్చితార్థం జరిగింది. ఈ జంట ఫిబ్రవరి 6వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో వివాహం చేసుకున్నారు. గుడియా అనే యువతి హిందూ అని నజియా అనే మీడియేటర్ అంకిత్ కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి వారి పెళ్లి జరిపించింది. గుడియా హిందూ అని పెళ్లి కొడకు అంకిత్ తో పాటు అని కుటుంబ సభ్యులు అందరూ నమ్మేశారు.

బంధువు ఇంటిలో డిన్నర్

బంధువు ఇంటిలో డిన్నర్

పెళ్లయిన తరువాత కొత్తగా పెళ్లయిన దంపతులు అంకిత్, గుడియా వారి బంధువుల ఇళ్లకు తిరగడం మొదలుపెట్టారు. వారణాసిలోని ఇంటి యజమాని బంధువు నజీనా ఇంట్లో పార్టీ కోసం కొత్త దంపతులకు వెళ్లారు. అక్కడ పార్టీ ముగించుకుని వరుడు అంకిత్ అతని స్వగ్రామం చేరుకోవడానికి అతని భార్య గుడియాతో పాటు అతని కుటుంబ సభ్యులతో కలిసి అజ్మీర్‌కు రైలు ఎక్కాడు. వారితో పాటు వధువు గుడియ బంధువులు నజినా, చోటు అదే రైలులో ఎక్కారు.

లూటీ చేసి ఎస్కేప్ అయిన పెళ్లికూతురు

లూటీ చేసి ఎస్కేప్ అయిన పెళ్లికూతురు

రైలులో అంకిత్ ఆనందంగా అతని సొంత ఊరికి బయలుదేరాడు. గుడియా బంధువు చోటు పెళ్లికొడుకు కుటుంబానికి చొటు టీ, పండ్లతో పాటు ఆహార పదార్థాలను కొనుగోలు చేసి తీసుకెళ్లి ఇచ్చాడు. ఆ పండ్లు తిని టీ తాగిన వరుడి కుటుంబ సభ్యులు కొంత సేపటి తరువాత రైలులోని వారి సీట్లలో స్పృహతప్పి పడిపోయాడరు. తరువాత కిలాడి వధువు గుడియా పెళ్లి కొడుకు అంకిత్ కుటుంబ సభ్యులు పెళ్లికి చేయించిఇచ్చిన బంగారు నగలతో పాటు వారి దగ్గర ఉన్న నగదు లూటీ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యింది.

 రైలులో రాత్రి ఏం స్కెచ్ వేశారంటే ?

రైలులో రాత్రి ఏం స్కెచ్ వేశారంటే ?

పెళ్లికూతురు గుడిమా బంధువులు అయినా నజీనా, చోటూ కూడా అక్కడి నుంచి జంప్ అయ్యారు. గుడియా, నజీనా, చోటు ముగ్గురూ కలిసి అంకిత్ కు పెళ్లి చేస్తామని వరుడిని కుటుంబాన్ని నిలువునా ముంచేసి జంప్ అయ్యారు. విందు ముగించుకుని గ్రామానికి తిరిగి వస్తుండగా ఆహారంలో మత్తు మందు కలుపుతారని అంకిత్ కుటుంబ సభ్యులు అస్సలు ఊహించలేకపోయారు. వరుడు అంకిత్ కుటుంబీకులు అపస్మారక స్థితిలో ఉండగానే వారి నుంచి డబ్బు, నగలు దోచుకున్న పెళ్లికూతురు గిడియాతో పాటు ముగ్గురూ పారిపోయి కాన్పూర్ రైల్వే స్టేషన్‌ చేరుకున్నారు.

రైల్వే పోలీసులు తెలివైన వాళ్లు

రైల్వే పోలీసులు తెలివైన వాళ్లు


ఉదయం పెళ్లికొడుకు అంకిత్ తో పాటు అతని కుటుంబ సభ్యులు మత్తులో నుంచి బయటకు వచ్చారు. తాము మోసపోయామని తెలుసుకున్న వరుడు అంకిత్, అతని కుటుంబ సభ్యులు షాక్‌కు గురై రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వధువు గుడియా, ఆమె సహచరురాలు నజీనాను వారణాసిలో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు. వధువుకు గుడియాకు ఇదివరకే వేరే వ్యక్తితో పెళ్లి అయ్యిందని, అంకిత్ తో ఆమెకు ఇది రెండో పెళ్లి అని పోలీసుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. ఈ కేసులో ఇంకా కొంతమంది ప్రమేయం ఉంటుదని అనుమానం వ్యక్తం చేసిన పోలీులు నిందితుల కోసం వెతుకుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+