ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన ఇల్లాలు!!

ఇటీవల భర్త నాలుక కొరికిన భార్య ఘటన మరచిపోకముందే.. ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. భర్తపై యాసిడ్ పోసిన భార్య దాడి చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

సమాజంలో రోజురోజుకీ మనుషుల్లో పాశవికి ప్రవృత్తి పెరిగిపోతుంది. చిన్న చిన్న కారణాలకే ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే దాకా పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మహిళల్లోనూ క్రూరత్వం పెచ్చు మీరి పోయింది. తాజాగా క్షణికావేశంలో భర్తపై చెయ్యకూడని, దారుణమైన దాడిని చేసింది ఓ మహిళ.

ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. యాసిడ్ పోసిన భార్య

ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు.. యాసిడ్ పోసిన భార్య


ఇంటికి ఆలస్యంగా వచ్చినందుకు భర్తతో గొడవపడిన ఓ మహిళ తన భర్త ముఖంపై యాసిడ్ పోసి దాడి చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. కాన్పూర్ లోని కూపర్ గంజ్ ప్రాంతంలో గుప్త తన భార్య పూనమ్ తో కలిసి జీవిస్తున్నారు. అయితే వారిద్దరి మధ్య ఇటీవల కాలంలో అనుమానం కారణంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఇటీవల గుప్త ఇంటికి చాలా ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు ఇంట్లో ఉన్న భార్య పూనమ్ ఎందుకు లేట్ అయిందని భర్తతో గొడవకు దిగింది.

భర్తపై కోపంతో ముఖంపై యాసిడ్ పోసిన భార్య

భర్తపై కోపంతో ముఖంపై యాసిడ్ పోసిన భార్య

ఇరువురి మధ్య మాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. భార్య గట్టిగా అరవడంతో అతను కూడా భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె మీద దాడి చేశారు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన భార్య కట్టలు తెంచుకున్న కోపంతో వాష్ రూమ్ లో ఉన్న యాసిడ్ ను తీసుకువచ్చి భర్త ముఖంపై పోసింది. భార్య ముఖంపై ఆసిడ్ పోయడంతో హాహాకారాలు చేసిన భర్త అక్కడే పడిపోయాడు.అతని కేకలు విన్నపక్కింటి వాళ్ళు అందరూ పరిగెత్తుకు వచ్చి అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే విషయాన్ని పోలీసులకు తెలిపారు.

 కేసు నమోదు.. భార్య అరెస్ట్

కేసు నమోదు.. భార్య అరెస్ట్

దీంతో పోలీసులు కేసు నమోదుచేసి భర్తపై యాసిడ్ పోసిన భార్యను అరెస్ట్ చేశారు. ఈ కేస్ పై పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ అత్యంత పాశవికంగా దాడులు చేసుకోవడం మాత్రం సమాజంలో ఆందోళన కలిగించే అంశం. ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి దారుణమైన నేరాలు జరిగేదాకా వెళుతుంది. ఇది సమాజంలో ఆందోళనకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. క్షణికావేశాలు కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఇటీవల కోపంతో భర్త నాలుక కొరికేసిన మరో ఇల్లాలు

ఇటీవల కోపంతో భర్త నాలుక కొరికేసిన మరో ఇల్లాలు


ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో ఒళ్ళు గగుర్పొడిచే మరో దారుణ ఘటన కూడా జరిగింది. భార్యను భర్త పుట్టింటి నుండి ఇంటికి రావాలని అడిగినందుకు ఆ భార్య భర్తతో గొడవపడి అమాంతం భర్త నాలుకను కొరికిపారేసింది. దీంతో భర్త ఆస్పత్రి పాలయ్యాడు. భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. సల్మా అనే మహిళ తన పిల్లలతో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో ఠాకూర్ గంజ్ ప్రాంతంలో తన తల్లి ఇంట్లో కొంతకాలంగా ఉంటుంది. ఇక భర్త పుట్టింట్లో ఉన్న ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లడానికి వెళ్ళగా, ఆమె భర్తతో తిరిగి వెళ్లడానికి నిరాకరించింది. దీంతో భార్యాభర్తలు ఇరువురి మధ్య తీవ్రవాగ్వాదం చోటుచేసుకుంది. కోపంలో భార్య భర్త నాలుక కొరికేసింది. అతని నాలుక తెగి నేలపై పడింది. ఈ ఘటన మరచిపోక ముందే భర్తపై భార్య యాసిడ్ పోసిన ఘటన యూపీలో చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+