Wife: భార్య చేతి వేలు కత్తిరించిన ఆర్మీ మేజర్, కట్నం కోసం టార్చర్, కేసు పెట్టిన భార్య !
మీరట్/ లక్నో: ఆర్మీలో మేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మా అమ్మాయి జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అమ్మాయి తండ్రి కూడా రిటైడ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కావడంతో పెళ్లి జరిగిపోయింది. అయితే నిత్యం తనను వరకట్నం కావాలని టార్చర్ పెడుతున్న తన భర్త తన చేతి వేలు కత్తిరించడానికి ఆర్మీ మేజర్ మీద ఆయన భార్య పోలీసు కేసు పెట్టడం కలకలం రేపింది.

2014లో పెళ్లి
ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లోని సదర్ బజార్ లో ఆర్మీ మేజర్ దంపతులు నివాసం ఉంటున్నారు. మీరట్ లోని 510 ఆర్మీ బేస్ లో భర్త మేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆర్మీలో మేజర్ గా ఉద్యోగం చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే మా అమ్మాయి జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అమ్మాయి తండ్రి కూడా రిటైడ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కావడంతో 2014లో వాళ్ల పెళ్లి జరిగిపోయింది.

మొత్తం కట్నం ఎప్పుడో ఇచ్చేశాము
మీటర్ లోని సదర్ బజార్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మేజర్ భార్య చెప్పిన మాటలు విన్న పోలీసు అధికారులు షాక్ అయ్యారు. తన భార్త మేజర్ గా ఉద్యోగం చేస్తున్నాడని, వరకట్నం తీసుకురాలేదని తన వేలు కత్తిరించాడని ఆమె పోలీసు కేసు పెట్టింది. ఇప్పటికే తన కుటుంబ సభ్యులు తన భర్త అడిగిన కట్నం మొత్తం ఇచ్చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

8 ఏళ్ల నుంచి నా భర్త టార్చర్ పెడుతున్నాడు
గత 8 సంవత్సరాల నుంచి తన భర్త తనను టార్చర్ పెడుతున్నాడని బాధితురాలు సదర్ బజార్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిందని మీటర్ అదనపు పోలీసు కమీషనర్ చంద్రకాంత్ మీనా చెప్పారని ప్రముఖ మీడియా సంస్థ ఐఏఎన్ఎస్ తెలిపింది. అయితే ఆర్మీ మేజర్ మీద ఎలాంటి కేసులు నమోదు చేశారు అనే విషయం బయటకు రాలేదు.

రాజీ చెయ్యాలని అనుకున్నారు
తన కూతురికి అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కు వెళితే పోలీసులు మొదట తన అల్లుడు అయిన మేజర్ మీద కేసు నమోదు చెయ్యకుండా మమ్మల్ని రాజీ చెయ్యడానికి ప్రయత్నించారని బాధితురాలి తండ్రి ఆరోపించారు. చివరికి మేజర్ మీద కేసు నమోదు చేశారని, అయితే ఎలాంటి సెక్షన్లు నమోదు చేశారు అనే విషయం మాకు చెప్పడం లేదని బాధితురాలి తండ్రి అంటున్నారు.












Click it and Unblock the Notifications