భర్త మర్మాంగాలపై కిరోసిన్ పోసి నిప్పంటించిన భార్య
భోపాల్: వైవాహిక జీవితంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఓ భార్య కిరోసిన్ భర్త మర్మాంగానికి నిప్పంటించి తగలెట్టింది. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. అతను నిద్రిస్తుండగా ఆ పనిచేసింది.
తన బారి నుంచి తప్పించుకోబోయిన ఆ భర్త ముఖంపై కూడా కిరోసిన్ పోసి మరీ నిప్పంటించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న రైసెన్ జిల్లాలోని సిర్సొడా గ్రామంలో నివాసముంటున్న రామ్ దయాళ్ అహిర్వార్(25)కు 2013లో వివాహమైంది. అయితే ఈ పెళ్లి రామ్ దయాళ్ భార్యకు ఇష్టం లేదు.

పెళ్లైన తర్వాత నిత్యం అతడితో భార్య గొడవపడుతుండేది. 22 ఏళ్ల ఆ మహిళ మూడు నెలల క్రితం భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. తల్లిదండ్రులు నచ్చజెప్పి తిరిగి భర్త దగ్గరకు పంపించారు. అయినా ఆమె తీరు మారలేదు.
మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తన భర్త రామ్ దయాళ్ మర్మాంగంపై కిరోసిన్ పోసి నిప్పంటించింది. తీవ్ర గాయాలపాలైన అతడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications