ఐఏఎస్ అరెస్ట్: షాక్.. భార్య, కూతురు ఆత్మహత్య

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: లంచం కేసులో అరెస్టైన సీనియర్ ఐఏఎస్ అధికారి బీకే బన్సాల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. బన్సాల్ భార్య సత్యబాల, ఆయన కూతురు నేహ ఆత్మహత్య చేసుకున్నారు. తూర్పు ఢిల్లీలోని మధు విహార్ ప్రాంతంలోని ప్లాట్‌లో వీరిద్దరు ఉరేసుకొని చనిపోయారు.

బన్సల్ కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్‌ జనరల్‌‌గా పని చేశారు. అవినీతి ఆరోపణలతో ఆయన అరెస్టయ్యారు. ఇప్పుడు భార్య, కూతురు ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై పోలీసులు ఘటనపై విచారణ జరుపుతున్నారు.

Wife, daughter of senior IAS officer who

కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) బన్సల్‌ను అవినీతి ఆరోపణలతో జులై 16న అరెస్టు చేసింది. ఒక వ్యవహారానికి సంబంధించి బన్సల్‌ రూ.50లక్షలు లంచం కోరగా మధ్యవర్తి దానిని రూ.20 లక్షలకు తగ్గించాడని, శనివారం నాడు ఢిల్లీలోని హోటల్‌ బయట ఓ వ్యక్తి నుంచి రూ.9లక్షలు లంచం తీసుకుంటుండగా బన్సల్‌ను పట్టుకున్నట్లు సీబీఐ వెల్లడించింది.

రెండో విడతగా రూ.9లక్షలు తీసుకుంటున్నాడని, మొదటి విడతలో బన్సల్‌ రూ.11లక్షలు తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. బన్సల్‌ ప్రస్తుతం పోలీస్ కస్టడీలోనే ఉన్నారు. ఇండియన్‌ కార్పొరేట్‌ లా సర్వీసెస్‌కు చెందిన సీనియర్‌ అడ్మినిస్ట్రేటివ్‌ అధికారి బన్సల్‌కు గత ఏడాది డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌గా ప్రమోట్ అయ్యారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Wife, daughter of senior IAS officer who was caught taking bribe found hanging in Delhi.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి